BB5 Highlights: తన కోపమే కొంపముంచిందా..!? బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియ అవుట్!

Sandeep Reddy
Updated on: 25 Oct 2021 11:37 AM IST
Bigg Boss Season 5 Sunday Episode Highlights 24th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ ఫన్ గా మొదలై ఎమోషనల్ గా ముగిసింది. ఆదివారం ఎపిసోడ్ లో మొదటగా హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులలో ఒకరికి ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం సరదాగా నాకౌట్ గేమ్స్ పెట్టడం జరిగింది.. ఈ గేమ్ లో చివరికి ఆని మాస్టర్ గెలుపొంది ఆ స్పెషల్ పవర్ ని పొందుతుంది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఆదివారం ఎపిసోడ్ లో లోబో, రవి, సిరి హనుమంత్, జెస్సిలు వరుసగా ఎలిమినేషన్ నుండి బయటపడగా, చివరికి డేంజర్ జోన్ లో ఉన్న ప్రియ.. ఆని మాస్టర్ లలో ప్రియ ఎలిమినేట్ అవడం జరిగింది.

ఆని మాస్టర్ సేవ్ అవడంతో సంతోషంతో సన్నీ కన్నీళ్లు పెట్టుకోగా.., ప్రియ ఎలిమినేట్ అయిందని ప్రియాంక సింగ్ ఎమోషనల్ అయింది. ఆ తరువాత బిగ్ బాస్ స్టేజి మీదకు వెళ్లిన ప్రియాంక ఇంటి సభ్యుల్లో ఒక్కొరికి మార్కులు ఇచ్చారు.. ఇందులో ప్రియాంక సింగ్, మానస్, ఆని మాస్టర్, విజే సన్నీ లు టాప్ లో ఉండగా.., లోబో, రవి లు తక్కువ మార్కులతో చివరి స్థానంలో నిలిచారు.

అప్పటికి ఏడుస్తున్న ప్రియాంక సింగ్ ని ప్రియ ఓదార్చడం.. తన తప్పు ఏదైనా ఉంటే క్షమించమని ప్రియని సన్నీ కోరడం.. అందుకు ప్రియ అదంతా గేమ్ లో భాగమేనని అవేమి తాను పట్టించుకోనని అంటూనే ఇంటి సభ్యులకు గుడ్ బై చెప్పి ప్రియ బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళిపోయింది.

మొదటివారం రెండు వారాలు బాగానే ఆడిన ప్రియ కొన్ని సందర్భాల్లో కోపంతో ఇంటిసభ్యులపై నోరు జారడంతోనే ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత వచ్చి ఓట్లు రాక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత శనివారం ఎపిసోడ్ లో కన్ఫషన్ రూమ్ కి వెళ్ళిన లోబో.. రవికి అవసరం ఉన్నప్పుడే లోబో గుర్తుకు వస్తాడని అన్న మాటలకు రవి బాధపడటం జరిగింది. లోబోతో తనకున్న 6 ఏళ్ళ స్నేహంలో ఎప్పుడు ఈరోజులా బాధపడలేదని.. లోబోని ఎంత బాగా చూసుకున్నా నన్ను మాత్రం అర్ధం చేసుకోలేదని లోబో ఎదురుగానే తన మనసులోని మాటని విశ్వకి రవి చెప్తూ బాధపడుతాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story