Bigg Boss 5 Promo: మాటల తూటాలతో.. సరదా ఆటలతో సాగనున్న వీకెండ్ ఎపిసోడ్

* తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 30 Oct 2021 6:37 PM IST
Bigg Boss Season 5 Telugu Saturday Weekend Promo 30th October 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం వీకెండ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ తో పాటు వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేసుకున్న సందర్భంలో జరిగిన గొడవల గురించే ఈ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముఖ్యంగా ఇంటి సభ్యులతో మాట్లాడనున్నాడు. ఇక ఆనీ మాస్టర్ ని కెప్టెన్సీ టాస్క్ నుండి ఎందుకు మధ్యలో వైదొలిగావని నాగార్జున అడగడం ప్రోమో చూశాము.

కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ ఉన్న జెస్సీపై విజే సన్నీ ఫైర్ అవడంపై నాగార్జున సన్నీకి చిన్నపాటి క్లాస్ పీకాడు. జెస్సీ చేతిలో పట్టుకున్న బ్యాగ్ ని కోపంలో అలా తన్నడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సన్నీని అడుగుతాడు నాగ్. ఆ తరువాత మానస్ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా ఉన్న జెస్సీ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవని నాగార్జునతో చెప్పడం.. సన్నీ, మానస్ ల మాటలు విన్న నాగ్ సంచాలక్ తీసుకున్నదే తుదినిర్ణయమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది.

ఆ తరువాత ఇంటి సభ్యుల్లో ఎవరు నిచ్చెన, ఎవరు పాము అని బిగ్ బాస్ ఇచ్చిన వైకుంటపాళీ ఆటలో రవి శన్ముఖ్ ని నిచ్చెన అని, కాజల్ ని పాము అని చెప్తాడు. విశ్వా..లోబోకి నిచ్చెన ఇవ్వగా..శన్ముక్ జస్వంత్ మాత్రం సిరి హనుమంత్ కి నిచ్చెన.. రవి పాము అని చెప్తాడు. ఇక కుక్క తోక వంకర బోర్డు జెస్సీ మెడలో ఉన్నట్టుగా తాజా ప్రోమో చూశాము. అయితే ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులపై ఫైర్ అవడంతో పాటు ఫన్ ని కూడా చేసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story