BB5 Highlights: నాగ్ మాటలతో.. ఇంటి సభ్యుల ఆటలతో సాగిన వీకెండ్ ఎపిసోడ్

* బిగ్ బాస్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 31 Oct 2021 12:07 PM IST
Bigg Boss Season 5 Telugu Saturday Episode Highlights 30th October 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ లో ఈవారం ఇంటి సభ్యులు చేసిన తప్పులను సరిదిద్దుతూ హోస్ట్ నాగార్జున తన స్టైల్ లో హౌస్ మేట్స్ కి క్లాస్ ఇచ్చారు. అంతకు ముందు వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపికై జైలుకు వెళ్ళిన సన్నీ దగ్గరే మానస్, కాజల్ ఉన్నారు. ఇక ఉదయం జరిగిన ఫ్రీడమ్ ఆయిల్ టాస్క్ లో ఆనీ మాస్టర్, కాజల్ టీమ్స్ లలో ఎవరు త్వరగా 50 పూరిలు చేస్తారో ఆ టీం విజేత నిలుస్తుందని ఆ టాస్క్ కి సంచాలక్ గా శన్ముఖ్ జస్వంత్ ని నియమించాడు బిగ్ బాస్.

అయితే ఈ టాస్క్ లో చివరగా ఆనీ మాస్టర్ టీంని విజేతగా ప్రకటించిన సంచాలక్ శన్ముఖ్ జస్వంత్ పై జైలులో ఉన్న విజే సన్నీ మరొకసారి రూల్ బుక్ చదివి విజేత ఎవరో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తాడు. ప్రియాంక, జెస్సీ, కాజల్, సిరి హనుమంత్, మానస్ ఉన్న టీం కూడా కష్టపడ్డారని, వారు ఆనీ మాస్టర్ టీం కంటే ముందే టాస్క్ పూర్తి చేశారని చెప్పడంతో ఆనీ మాస్టర్ ఒక్కసారిగా సన్నీపైకి ఆవేశంతో అనవసరపు మాటలతో అరుస్తూ అసలు విషయాన్నీ పక్కనపెట్టి మీరు ముగ్గురు (మానస్, సన్నీ, కాజల్) ఎప్పుడు ఒక టీంగా ఆడుతారని ఆనీ మాస్టర్ ఎప్పుడు చెప్పే పాత కథనే మరొకసారి కొత్తగా చెప్తూ తన మాటలతో, చేష్టలతో ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించింది.

అదే సమయంలో మానస్ కూడా మేము ఇక్కడ ముగ్గురం మాట్లాడితే మీరు అక్కడ అయిదుగురు టీం అంటూ చేసిన కామెంట్ కి అటు శ్రీరామచంద్ర.. సన్నీ, మానస్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కాసేపు గందరగోళం చేశాడు. ఇక నాగార్జున ఇంటి సభ్యులలో సన్నీ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జెస్సీపై ప్రవర్తించిన తీరుకు, కొంతమంది ఇంటి సభ్యులపై ఆగ్రహానికి వచ్చినందుకు అతడిని మందలిస్తునే ఆట ఆడు ఆవేశంలో ఎవరి పైకి వెళ్ళకు ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో నువ్వు ఓకే అంటూ చెప్పి కూల్ చేస్తాడు. ఇక ఇంటి సభ్యులతో వైకుంటపాళీ ఆటని ఆడిస్తూ ఇంట్లో ఎవరు నిచ్చెన, ఎవరు పాము అని ఎంపిక చేసుకోవాలని సూచిస్తాడు. ఇక ఇంటి సభ్యులు ఎవరు ఎవరిని నిచ్చెన, పాముగా ఇలా ఎంపిక చేసుకున్నారు.

జెస్సీ.. నిచ్చెన: విశ్వా, పాము: సన్నీ

రవి.. నిచ్చెన: శన్ముఖ్ జస్వంత్, పాము: కాజల్

ప్రియాంక సింగ్.. నిచ్చెన: మానస్, పాము: లోబో

కాజల్.. నిచ్చెన: మానస్, పాము: శ్రీరామచంద్ర

సన్నీ.. నిచ్చెన: మానస్ , పాము: శన్ముఖ్ జస్వంత్

విశ్వా.. నిచ్చెన: లోబో , పాము: కాజల్

లోబో.. నిచ్చెన: రవి, పాము: సన్నీ

శ్రీరామచంద్ర.. నిచ్చెన: ఆనీ మాస్టర్, పాము: కాజల్

ఆనీ మాస్టర్.. నిచ్చెన: రవి, పాము: కాజల్

మానస్.. నిచ్చెన: సన్నీ, పాము: రవి

శన్ముఖ్ జస్వంత్.. నిచ్చెన: సిరి హనుమంత్, పాము: రవి

సిరి హనుమంత్.. నిచ్చెన: శన్ముఖ్ జస్వంత్, పాము: సన్నీ

మరో ఆటలో తెలుగు సామెతలు ఉన్న బోర్డులను ఇంటి సభ్యులు తమకి నచ్చి వ్యక్తికి ఆ బోర్డుని ఇవ్వాలని చెప్తాడు నాగార్జున. అందులో భాగంగా ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది బోర్డుని కాజల్.. శ్రీరామచంద్రకి, కుక్కతోక వంకర బోర్డుని సన్నీ..జెస్సీకి, అబద్దం చెప్పిన అతికినట్టు ఉండాలి బోర్డుని మానస్.. రవికి ఇస్తారు. అంతంత కోడికి అద్ధశేరు మసాలా బోర్డుని శ్రీరామచంద్ర.. కాజల్ కి, దున్నపోతు మీద వాన కురిసినట్టే విశ్వా..లోబోకి, పైన పటారం లోన లొటారం బోర్డుని జెస్సీ.. సన్నీకి ఇచ్చాడు. ఇలా ఇంటి సభ్యులు సరదాగా వారికి నచ్చిన ఇంటి సభ్యులకు బోర్డులు వేస్తూ కాసేపు నవ్వుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story