Bigg Boss 5 Highlights: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనేనా..!?

* చూసేవి అన్ని నిజాలు కాదని మరోసారి బిగ్ బాస్ ప్రోమో, ఎపిసోడ్ ద్వారా మరోసారి అర్ధమయింది.

Sandeep Reddy
Updated on: 24 Oct 2021 11:34 AM IST
Bigg Boss Season 5 Telugu Saturday Episode Highlights 23rd October 2021 | Bigg Boss 5 Updates
X

 బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శనివారం ప్రోమోలో నాగార్జున మాట్లాడిన మాటలకు, ఎపిసోడ్ లో జరిగిన దానికి "మనం చూసేవి అన్ని నిజాలు కాదు" అనే మాట బుల్లితెర ప్రేక్షకులకు అర్ధమయింది. ప్రోమోలో సన్నీ కెప్టెన్సీ క్యాన్సల్ అన్న నాగార్జున మాటకి సోషల్ మీడియాలో శనివారం నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ విషయానికొస్తే ఈవారం ఇంటి సభ్యులు చేసిన తప్పులను, ప్రవర్తించిన తీరుపై నాగార్జున నవ్వుతూనే అందరికి కౌంటర్ ఇచ్చాడు.

ఇంటి సభ్యుల్లో ఎవరూ వరస్ట్ పెర్ఫార్మర్ అనే ప్రశ్నకి ఎక్కువ మంది విశ్వని ఎంపిక చేసుకున్నారు. ఈవారం ఎపిసోడ్ తరువాత జైలుకి వెళ్లాలని నాగార్జున.. విశ్వకి సూచించాడు..ఆ తరువాత శణ్ముఖ్ జస్వంత్.. సిరి హనుమంత్ మధ్య జరిగిన గొడవని బిగ్ బాస్ ఫన్నీ వీడియోగా చూపించి ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. ఇక ఈవారం సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన లోబోని కన్ఫషన్ రూమ్ లోకి పిలిచి ఒక్కో ఇంటి సభ్యుడి గురించి నాగార్జున అడిగి ఎవరూ ఎవరూ డూప్.. ఎవరు తోప్ చెప్పుమన్నాడు.

ఇంటి సభ్యులు తాను మాట్లాడేది ఎవరు చూడట్లేదని లోబో హౌస్ మేట్స్ గురించి ఏమి అనుకుంటున్నాడో తన మనసులోని మాటలని నాగార్జునతో చెప్పాడు..రవి తనకి అవసరం ఉన్నపుడే లోబో గుర్తు వస్తాడని, ప్రియ ఒక్కోసారి ఒకలాగా మాట్లాడుతుందని, ప్రియాంక సింగ్ ప్రవర్తనే అసలు నాకు నచ్చలేదని, కాజల్, అనీ మాస్టర్, షణ్ముఖ్ జస్వంత్ లు పేర్లను వివిధ కారణాలు చెబుతూ డూప్ అనీ చెప్పేశాడు.

ఇక తోప్ ల విషయానికొస్తే మానస్, సన్నీ, సిరి హనుమంత్, జెస్సి, విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను చెప్పాడు. ఈవారం నామినేట్ అయిన ఇంటి సభ్యుల నుండి శ్రీరామ చంద్ర, కాజల్ శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. అయితే జెస్సి, ఆనీ మాస్టర్, ప్రియ ముగ్గురు ఇంటి సభ్యులు ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story