Bigg Boss 5 Telugu Promo: శన్ముఖ్ ని చిన్న పోరడు అంటూ తీసిపారేసిన లోబో

* బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది.

Sandeep Reddy
Published on: 6 Sept 2021 4:17 PM IST
Bigg Boss Season 5 Telugu Promo Released Today 06 09 2021
X

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ప్రోమో (ఫోటో: స్టార్ మా)

Bigg Boss Season 5 Telugu: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది.. సెప్టెంబర్ 5న మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్ల ఎంట్రీతో మొదలైన బిగ్ బాస్ మొదటి రోజు నుండే రసవత్తరంగా సాగుతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన డస్ట్ బిన్ (చెత్త కుప్ప) టాస్క్ లో కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు సీరియస్ కామెంట్స్ చేసుకుంటూ ఉన్న ప్రోమో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.

ప్రోమోలో యాంకర్ రవి డాన్స్ మాస్టర్ నటరాజ్ ని చూస్తే స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నారని అన్న మాటకి నటరాజ్ తనకు నటించడం రాదని తాను అలానే ఉంటానని కౌంటర్ ఇచ్చాడు. మరోపక్క లోబో శన్ముఖ్ జస్వంత్ ని చిన్న పిల్లోడు అంటూ తీసి పడేసిన పని చేయగా యాంకర్ రవిని నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక సీరియల్ నటుడు విజే సన్నీ యూట్యూబ్ శన్ముఖ్ జశ్వంత్ ని ఉద్దేశించి బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు కొంతమందికి సైన్యాలు ఉన్నాయని అనుకున్నా కాని హౌస్ లోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఒక సైన్యం వస్తదని సీరియస్ అయ్యాడు.

మొదటి రోజే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగించారు. మొదటి వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా 19 మంది టాస్క్ లో పాల్గొనాలి కాబట్టి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గంట సమయం కంటే ఎక్కువే పట్టే అవకాశం ఉంది. బిగ్ బాస్ మొదటి రోజే కాంటెస్టంట్ లను సోషల్ మీడియాలో విజే సన్నీ, సిరిలను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎవరికీ ఎన్ని ఆర్మీలు ఉన్నా, ఎయిర్ ఫోర్సు లు ఉన్నా ప్రేక్షకులకు నచ్చితేనే.. కంటెస్టెంట్లను మెచ్చుతేనే విజేతగా నిలుస్తారనేది నిజం.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story