BB5 - Priyanka Singh: అమ్మాయైనా, అబ్బాయైనా నువ్వే మా సర్వం

* గురువారం ప్రోమో విడుదల చేసిన బిగ్ బాస్ 5 తెలుగు

Sandeep Reddy
Updated on: 7 Oct 2021 4:36 PM IST
Bigg Boss Season 5 Telugu Priyanka Singh Birthday Special 07 10 2021 Promo Released
X

Bigg Boss Season 5 Telugu: (Photo: Star Maa)

BB5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో మొదటిసారి హౌస్ లో ఇంటి సభ్యులకు నచ్చిన పనితో పాటు బుల్లితెర ప్రేక్షకులు మెచ్చిన పని బిగ్ బాస్ చేసినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే అర్ధమవుతుంది. ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక మొదట్లోనే తాను ట్రాన్స్ జెండర్ గా మారడానికి కారణాలను ఇంటి సభ్యులకు వివరించడమే కాకుండా ఆ విషయాన్ని తన తండ్రికి ఎలా చెప్పాలో అర్ధంకాక బాధపడిన, భయపడిన సందర్భాలను పలు సందర్భాలను హౌస్ మేట్స్ తో పంచుకుంది.

తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో ప్రకారం గురువారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లితండ్రులు మాట్లాడిన వీడియోతో బిగ్ బాస్ ప్రియాంకకి సర్ ప్రైస్ ఇచ్చాడు. ఆ వీడియోలో మాట్లాడిన ప్రియాంక తండ్రి నువ్వు అమ్మాయైన, అబ్బాయైన నువ్వే మా సర్వం అంటూ ఎమోషనల్ గా చెప్పిన మాటలు అటు ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తున్నాయి.

తన తల్లిదండ్రుల మాటలు విన్న ప్రియాంక సింగ్ తన సొంత ఇంటికి తన తల్లిదండ్రులని కలవడానికి కూడా ఒక దొంగలా వెళ్లానని, ఈరోజు తన తండ్రి మాట్లాడిన మాటలకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలిపింది. ఆ తరువాత బిగ్ బాస్ ప్రియాంక కోసం ఒక పట్టుచీర, పూలు, గాజులు పంపించి ప్రియాంక సింగ్ కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వీడియోతో ఇంటి సభ్యులు కూడా ప్రియాంక సింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story