Bigg Boss 5 Promo: లెటర్ తీసుకుంటారా..? నామినేట్ అవుతారా..!?

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 26 Oct 2021 11:30 AM IST
Bigg Boss Season 5 Telugu Monday Promo Released 25th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఏడో వారం నామినేట్ అయిన ప్రియ బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తరువాత తాజాగా ఎనిమిదో వారం ఎవరెవరు నామినేట్ అవుతారోనని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులు తమ ప్రియమైన వారి నుండి లేఖని పొందాలంటే.. కోరుకున్న ప్రతిది దక్కదని, ఏదైనా దక్కించుకోవాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుందని బిగ్ బాస్ నియమాన్ని ఉంచుతాడు.

తమ ప్రియమైన వారి నుండి లేఖని పొందిన ఇంటి సభ్యులు ఈ వారం నామినేట్ అవగా, కన్ఫెషన్ రూమ్ నుండి లేఖని తీసుకున్న ఇంటి సభ్యుడు ఆ లేఖకి సంబంధిత వ్యక్తికి ఇస్తే ఆ ఇంటి సభ్యుడు ఈవారం నామినేషన్ లో ఉండడని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఇక కన్ఫెషన్ రూమ్ లో రవి, శన్ముఖ్ ఉండటం.. ఆ తరువాత మానస్, శ్రీరామచంద్ర ఇద్దరు లెటర్స్ పట్టుకొని రావడం ప్రోమోలో చూడొచ్చు.

అయితే సిరి హనుమంత్, లోబోలు ఇద్దరు కంటతడి పెట్టుకోవడం చూస్తుంటే ఈ వారం నామినేట్ అయినందుకు బాధపడుతున్నారో లేదా తమ ప్రియమైన వ్యక్తుల దగ్గరి నుండి వచ్చిన లెటర్ ని పొందలేనందుకు బాధపడ్డారో తెలియాలంటే ఈరోజు జరగనున్న బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియని చూడాల్సిందే.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story