BB5 Updates: ఈవారం అగ్నిపరీక్షలో నెగ్గేదెవరో..!? నామినేషన్ వివరాలు ఇలా..

* సోమవారం బిగ్ బాస్ సీజన్ 5 హైలైట్స్

Sandeep Reddy
Published on: 12 Oct 2021 12:03 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Nomination Episode Highlights on 11th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu Updates: బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం నామినేషన్ల ప్రక్రియ అగ్నిపరీక్షతో హాట్ హాట్ గా సాగింది. సోమవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు నామినేషన్ లో భాగంగా ఒకరితో మరొకరికి మాటల యుద్ధం సాగింది. నామినేషన్ లో ప్రక్రియను మొదలుపెట్టిన సన్నీ.. జెస్సీతో పాటు యాంకర్ రవిని నామినేట్ చేస్తాడు.

కెప్టెన్సీ టాస్క్ లో తనని కారణం తెలియకుండానే గేమ్ ఆడటం రాదని అనడమే కాకుండా బజర్ మ్రోగకముందే తన దగ్గర ఉన్న నాణేలను దొంగిలించి తనపై ఉన్న నమ్మకాన్ని జెస్సి పోగొట్టుకున్నాడని సన్నీ చెప్పడం జరిగింది. ఆ తరువాత రవి కూడా తను పాల్గొనే అవకాశం ఉన్న కుస్తీ పోటీలో పాల్గొనలేదని, కాని ఆ తరువాత టాస్క్ లో పాల్గొనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ తన కారణాన్ని చెబుతూ రవిని నామినేట్ చేస్తాడు.

ఇలా ఒక్కో ఇంటి సభ్యుడు ఒక్కో కారణాలను చెబుతూ నామినేట్ చేసుకున్నారు. ఈ నామినేషన్ లో ప్రియ మరోసారి సన్నీని సిల్లీ కారణంతోనే నామినేట్ చేయడం అతనికి కోపాన్ని తెప్పించింది. హౌస్ లో తాను ఉన్నన్ని రోజు మిమ్మల్నే నామినేట్ చేస్తానని ప్రియ మొహం మీదే సన్నీ చెప్పడం జరిగింది. ఇక ప్రియాంక సింగ్ చెత్త కారణాలతో నన్ను నామినేట్ చేశారని విశ్వా, లోబోలను నామినేట్ చేసింది. ఇలా ఇంటి సభ్యులు ఎవరు ఎవరిని నామినేట్ చేశారనే వివరాల్లోకి వెళితే..

సన్నీ- యాంకర్ రవి, జెస్సి

విశ్వా - అనీ మాస్టర్, ప్రియాంక

రవి - సిరి హనుమంత్ , మానస్

జెస్సి - శ్రీరామచంద్ర, సన్నీ

ప్రియాంక - విశ్వా, లోబో

మానస్ - రవి, లోబో

అనీ మాస్టర్ - శన్ముఖ్ జస్వంత్, విశ్వా

శ్రీరామచంద్ర - శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్

కాజల్ - శ్రీరామచంద్ర, శ్వేతవర్మ

శన్ముఖ్ జస్వంత్ - శ్రీరామచంద్ర, లోబో

ప్రియ - విశ్వా, సన్నీ

లోబో - జెస్సి, ప్రియాంక

శ్వేతవర్మ - సిరి హనుమంత్, కాజల్

సిరి హనుమంత్ - శ్వేతవర్మ, శ్రీరామచంద్ర

Sandeep Reddy

Sandeep Reddy

Next Story