BB5 Latest Promo: నమ్మకానికి నమ్మకద్రోహానికి మధ్య అగ్నిపరీక్ష

* బిగ్ బాస్ 5 తెలుగు సోమవారం రెండో ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 11 Oct 2021 5:52 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Second Promo Released on 11 10 2021 | Bigg Boss 5 Promo
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

BB5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం నామినేషన్లు నిజానికి అబద్ధానికి.., నమ్మకానికి నమ్మకద్రోహానికి మధ్య జరుగుతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమోతో అర్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన సోమవారం మొదటి ప్రోమోలో మండే మంటల్లో నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుడి ఫోటోని వేసి కారణాలు చెప్తుండగా తాజాగా విడుదలైన ప్రోమోలో నామినేషన్ లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్దాన్ని చూడవచ్చు.

కెప్టెన్సీ టాస్క్ లో జెస్సీ తమవైపు ఉంటూనే నాణేలను దొంగతనం చేశాడని అందుకే అతన్ని నామినేట్ చేస్తున్నట్టు లోబో చెప్పడం.. అందుకు జెస్సి అది నా గేమ్ అంటూ నా ఇష్టమంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రియాంక సింగ్ అటు లోబోతో పాటు విశ్వాని నామినేట్ చేస్తూ అన్ని వెధవ కారణాలు చెప్తున్నారంటూ తన ఆవేశాన్ని మాటల్లో చూపిస్తుంది. ఆ తరువాత మానస్.. లోబో చివరి నిమిషంలో చేసిన నమ్మకద్రోహం వల్లే కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయామని లేదంటే సన్నీ టీం గెలిచి ఉండేదని లోబోని నామినేట్ చేస్తాడు మానస్.

మరోపక్క ప్రియ సీజన్ మొదటి నుండి ప్రతిసారి విజె సన్నీని నామినేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ వారం కూడా తాను పాత కారణాలనే కొత్తగా చెప్తూ సన్నీని నామినేట్ చేయడం చూడనున్నాము అయితే ఈ వారం ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన సన్నీ.. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్ చేస్తానని ప్రియకి సన్నీ ముక్కుసూటిగా చెప్తాడు.

ఇక తాను మాట్లాడింది ఒకటి అయితే సిరి హనుమంత్ ఇంటి సభ్యులకు మరోలా చెబుతుందని రవి మాట్లాడటం చూడవచ్చు.ఇలా ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన నమ్మకద్రోహానికి, కొంతమంది ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడుతూ నిజాన్ని అబద్దంగా.., అబద్దాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు నామినేషన్ ప్రక్రియలో అర్ధమవుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story