Bigg Boss 5 Promo: మండే నామినేషన్ లోనూ ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే..!!

* తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం రెండో ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 8 Nov 2021 6:13 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Second Promo 08th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం రెండో ప్రోమోని తాజాగా విడుదల చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆనీ మాస్టర్ విజే సన్నీ, మానస్, ఆర్జే కాజల్, శన్ముఖ్ జస్వంత్ తో పాటు జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేయడం ప్రోమోలో చూశాము. జైలులోకి పంపి నామినేట్ చేయడంతో అప్నా టైం ఆయేగా అంటూ సన్నీ కామెంట్ చేయడం.., అందరికి టైం వస్తది సన్నీ అంటూ ఆనీ మాస్టర్ రిప్లై ఇచ్చింది. ఇక ప్రియాంక సింగ్ ఇంటి నుండి బయటికి వెళ్తే మానస్ దగ్గర ఆ ప్లేస్ ని విజే సన్నీ భర్తీ చేస్తాడని రవి, శన్ముఖ్ జస్వంత్ మాట్లాడుకున్నారు.

శ్రీరామచంద్ర, రవి, జెస్సీ "కీ" కోసం ఒకరికొకరు మాట్లాడుకోవడం.. ఆ తరువాత "కీ" పొందిన శ్రీరామచంద్ర జైలులో ఉన్న ఇంటి సభ్యులతో ఎవరికీ నామినేషన్ లో ఉండాలని లేదో వాళ్ళని బయటికి తీసుకొస్తానని చెప్పడం.. దాంతో ఇంటి సభ్యులు అందరికి నామినేషన్ లో ఉండాలని లేదని చెప్పడంతో శ్రీరామచంద్ర ఎవరిని ఎంపిక చేశాడో తెలియాల్సి ఉంది. ఇక ప్రోమో చివర్లో విజే సన్నీ జైలు నుండి ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటికి రావడంతో నామినేషన్ నుండి బయటపడ్డడా లేదా నామినేషన్ టాస్క్ పూర్తయిన తరువాత బయటికి వచ్చాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story