Bigg Boss 5 Telugu Promo: ఇంటి సభ్యులందరూ ఈ వారం నామినేషన్ లో ఉన్నారా..!?

* తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం ఎపిసోడ్ ప్రోమో

Sandeep Reddy
Published on: 1 Nov 2021 5:51 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Second Promo 1st November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదలైంది. "క్రీమ్ పూయి.. నామినేషన్ లో వెయ్యు" నామినేషన్ టాస్క్ లో భాగంగా మొదటి ప్రోమోలో మానస్, సన్నీ, ఆనీ మాస్టర్, ఆర్జే కాజల్ నామినేట్ అవగా తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియాంక సింగ్.. రవిని నామినేట్ చేసింది. ఇంట్లో రవి అలోచించినంత ఎవరు ఆలోచించరని అంటూనే ప్రియాంక సింగ్ రవిని నామినేట్ చేసినట్టు ప్రోమోలో చూశాము.

ఆ తరువాత విశ్వా ఇంట్లో ఉండటానికి నన్ను అర్హత లేదని ఎలా అంటావంటూ ప్రియాంక సింగ్ ని అడగడం నేను ఆ మాట నేను అనలేదని ఆమె చెప్పడం చూశాము. ఇక కాజల్.. రవి, శ్రీరామచంద్రలను నామినేట్ చేయడం ప్రోమోలో చూడొచ్చు. నీ గేమ్ నువ్వే ఆడు.. వేరే గేమ్ ఆడొద్దు అంటూ శన్ముఖ్ జస్వంత్.. ప్రియాంక సింగ్ ని నామినేట్ చేస్తాడు. ఇప్పటివరకు చూసిన ప్రోమోలో జెస్సీ మినహా ఇంటి సభ్యులందరూ నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక జెస్సిని కూడా మానస్, సన్నీలలో ఎవరో ఒకరు కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించనందుకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కెప్టెన్ శన్ముఖ్ తప్ప ఇంటి సభ్యులు అందరు ఈవారం నామినేషన్ లో ఉండటం ఖాయం. ఇక తాజాగా విడుదలైన రెండు ప్రోమోలలో చూసిన ప్రకారం ఇంటి సభ్యుల నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆనీ మాస్టర్ - కాజల్

విజే సన్నీ- సిరి హనుమంత్

విశ్వా - మానస్

కాజల్ - శ్రీరామచంద్ర, రవి

సిరి హనుమంత్ - విజే సన్నీ, ఆనీ మాస్టర్

శ్రీరామచంద్ర - మానస్

ప్రియాంక సింగ్ - రవి

శన్ముఖ్ జస్వంత్ - ప్రియాంక సింగ్


Sandeep Reddy

Sandeep Reddy

Next Story