Bigg Boss 5 Promo: జైలులో ఉండి ఈ వారం నామినేషన్ లో నిలిచేదెవరో..!?

* బిగ్ బాస్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 8 Nov 2021 1:12 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Promo 08th November 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న విశ్వా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులకు ర్యాంకులు ఇచ్చిన విశ్వా.. టాప్ 5 లో సిరి హనుమంత్, విజే సన్నీ, శన్ముఖ్ జస్వంత్, రవి, శ్రీరామచంద్ర లు ఉంటారని.. శ్రీరామచంద్రలో తన తమ్ముడిని చూసుకున్నానని, బిగ్ బాస్ 5 విన్నర్ గా శ్రీరామ్ నిలుస్తాడని విశ్వా చెప్పుకొచ్చాడు.

సోమవారం నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచిన ఆనీ మాస్టర్ సన్నీ, మానస్, ఆర్జే కాజల్, శన్ముఖ్ జస్వంత్ లను జైలులో వేసి నామినేషన్ ప్రక్రియని మొదలుపెడుతుంది. జైలులో ఉన్న ఇంటి సభ్యులను బయటికి తీసుకురావడానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఎవరైతే ముందుగా జైలు "కీ" తీసుకుంటారో ఆ సభ్యుడు జైలులో ఉన్న ఒక ఇంటి సభ్యుడిని బయటికి తీసుకొని రావొచ్చు. బయటికి వచ్చిన ఆ ఇంటి సభ్యుడు.. మిగిలిన ఇంటి సభ్యులలో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది.

అయితే ఈ టాస్క్ లో మొదటగా ప్రియాంక సింగ్.. మానస్ ని జైలు నుండి బయటికి తీసుకొని రావడం.. బయటికి వచ్చిన మానస్ ఈ వారం రవి, జెస్సిలను నామినేట్ చేయడం జరిగింది. ఆ తరువాత సిరి హనుమంత్... శన్ముఖ్ జస్వంత్ ని కాదని జెస్సీని జైలు నుండి బయటికి తెస్తుంది. ఆ తరువాత జెస్సీ.. శన్ముఖ్ జస్వంత్ ని బయటికి తీసుకొని రావడం.. బయటికి వచ్చిన శన్ముఖ్ జస్వంత్ ప్రియాంక సింగ్ ని నామినేట్ చేయడం జరిగింది. కెప్టెన్ గా ఉన్న సమయంలో ప్రియాంక సింగ్ ప్రవర్తన నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు కారణాన్ని చెబుతాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story