Bigg Boss 5 Telugu Promo: మండే నామినేషన్స్ తో మళ్ళీ మొదలైన మాటల వార్

* బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 27 Nov 2021 5:06 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Promo 1st November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu Promo: దీపావళి సందర్భంగా సరదాగా ఆటపాటలతో సాగిన బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ అలా ముగిసిందో లేదో సోమవారం నామినేషన్ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య మాటలతో హీట్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు తొమ్మిదో వారం నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసింది. "క్రీమ్ పూయి..నామినేషన్ లో వెయ్యు" నామినేషన్ టాస్క్ లో భాగంగా మానస్.. శ్రీ రామచంద్రతో నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్తే నాకు ఫరక్ పడదు అంటూ క్రీమ్ పూసి నామినేట్ చేశాడు.

ఇక సిరి హనుమంత్ గేమ్ లో ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాని హెల్త్ గురించి మాట్లాడటం నాకు నచ్చలేదని విజే సన్నీని నామినేట్ చేసింది. ఆ తరువాత శ్రీరామచంద్ర.. ఇటీవల జరిగిన టాస్క్ తరువాత మానస్ మీ ఐదుగురు ఒక టీం అని ఎవరిని ఉద్దేశించి అన్నావని, మన మధ్య ఈ గొడవలు చైన్ బ్యాచ్ గొడవల్లా ఉన్నాయంటూ మానస్ ని నామినేట్ చేస్తాడు. రవి కూడా మానస్ మీరంతా టీం అని చెప్పిన మాటనే నామినేషన్ లో ప్రస్తావించాడు. అందుకు మానస్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు.

ఇక రవి.. ఆర్జే కాజల్ ని నామినేట్ చేయడం ప్రోమోలో చూశాము. సిరి హనుమంత్ సన్నీతో పాటు ఆనీ మాస్టర్ ని నామినేట్ చేసింది. ఈ వారం నామినేషన్ లో ఆనీ మాస్టర్, ఆర్జే కాజల్, విజే సన్నీ, మానస్ లు ఉండగా ఆ తరువాత మానస్, సన్నీ, కాజల్, అనీ మాస్టర్ లలో ప్రియాంక సింగ్, విశ్వా, రవి, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్ ని తప్పకుండా నామినేట్ చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ప్రస్తుతం బిగ్ బాస్ కెప్టెన్ గా ఉన్న శన్ముఖ్ జస్వంత్ మినహా ఇంటి సభ్యులు అందరు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story