BB5 Updates: సన్నీ, ప్రియలో తప్పెవరిది.? బ్రహ్మ అంటూనే శన్ముఖ్ ని బలి చేశారా..!!

* బిగ్ బాస్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 21 Oct 2021 2:04 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Highlights 20th October 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ 5  తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా కోడిగుడ్లను కొందరు కష్టపడి ఆటఆడి సంపాదించగా.. మరికొందరు మాత్రం ఉన్న వారివద్ద దొంగిలించడమే కాకుండా అసభ్యంగా మాట్లాడుతూ బుధవారం రచ్చ చేశారు. ఇక బుధవారం జరిగిన ఎపిసోడ్ లో అసలు విషయానికొస్తే ప్రోమోలో చూసినట్టుగానే విజే సన్నీ, ప్రియల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

విజే సన్నీ సేకరించి దాచుకున్న గుడ్లను దొంగిలించడానికి ప్రియ రావడం, తన గుడ్లను కాపాడుకునే సమయంలో సన్నీ బెంచ్ ని పట్టుకోవడంతో అది కాస్త అనుకోకుండా ప్రియ కాలికి తాకడంతో అక్కడ అనుకున్నంత సీన్ ఏమి జరగపోయిన సన్నీపై చేయి చేసుకోవడం, చెంప పగులుతది అంటూ మాటిమాటికి అంటున్నా అప్పటివరకు సహనంతో ఉన్న సన్నీకి కోపం వచ్చిన నోరు జారకుండా తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు.

ఇక ఇంటి సభ్యులు సన్నీ తప్పులేదని కావాలని చేయలేదని.. అనుకోకుండా జరిగిందని ఎంత చెప్పినా మాట వినని ప్రియ తాను ఎప్పుడు మాట్లాడేలాగే అర్ధంలేని మాటలతో నేనే కరెక్ట్ అని అదే నా గేమ్ అని తనకు తాను అనుకోవడం గత కొన్ని ఎపిసోడ్ ల నుండి చూస్తూనే ఉన్నాం. బుధవారం ఎపిసోడ్ లో మాత్రం ప్రియ ప్రవర్తించిన తీరు అటు ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సన్నీ, ప్రియ విషయంలో మాత్రం సన్నీది ఎలాంటి తప్పులేదని తన మాటల్లో,ప్రవర్తనలోనే బుధవారం ఎపిసోడ్ లో ప్రేక్షకులకు అర్ధం అయింది.

మానస్ తో సన్నీ మాట్లాడుతూ నామినేషన్ రోజు నుండి తప్పులేకున్నా తనని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని అయిన ఏం ఫర్వాలేదని తన గేమ్ తాను ఆడుతానని సన్నీ చెప్తాడు. మరోపక్క జెస్సీకి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అందుకు ఇంటి సభ్యుల్లో ఎవరిదైన ఒకరి సహాయం తీసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో తన స్నేహితుడైన శన్ముఖ్ జస్వంత్ ని వదిలి సిరి హనుమంత్ కి టాస్క్ గురించి చెప్పడం జరిగింది.

వీరిద్దరూ కలిసి శన్ముఖ్, ప్రియ, ప్రియాంక దగ్గర ఉన్న మొత్తం గుడ్లను అడిగి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కెప్టెన్సీ పోటీదారుల కోసం ఆడుతున్న ఈ టాస్క్ లో శన్ముఖ్ గుడ్లను తీసుకోవడం వలన అతడు ఆ పోటీలో నుండి తప్పుకుంటాడని తెలిసిన సిరి, జెస్సీ ఏవో మాటలు చెప్పి అలా నమ్మించి మోసం చేయడంతో అతడి రియాక్షన్ ఎలా ఉండబోతుందో గురువారం ఎపిసోడ్ లో చూడనున్నాము.

ఇలా 24 గంటలు తన పక్కన ఉండే స్నేహితులే మాయమాటలు చెప్పి శన్ముఖ్ జస్వంత్ ని నమ్మించడం, మొదటి నుండి ప్రియతో వైరం వద్దనుకున్నఏదో రకంగా సన్నీని ప్రియ అనవసరపు మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టడం జరుగుతూనే ఉంది. మరి బుధవారం జరిగిన మాటల యుద్ధంపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గట్టిగానే స్పందిస్తాడో.. తూతూ మంత్రంలా ముగిస్తాడో చూడాల్సిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story