Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ ఆట.. సన్నీ వేటలో "మండే" నామినేషన్లు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎవరు ఊహించని విధంగా జరిగింది.

Sandeep Reddy
Published on: 19 Oct 2021 11:35 AM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Highlights 18th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss Season 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎవరు ఊహించని విధంగా జరిగింది. ప్రతివారం నామినేషన్ లాగానే ఈ వారం కూడా ఉంటుందని ఊహించిన ఇంటి సభ్యులు ఎవరికీ వారు తమని నామినేషన్ చెయ్యొద్దని తన సహచరుల చుట్టూ ప్రదక్షణలు చేయడం, బ్రతిమిలాడుకోవడం జరిగింది. కాని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ ఇచ్చిన వేటగాడు టాస్క్ తో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

ఈ టాస్క్ కోసం విజే సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సీలను వేటగాళ్ళుగా బిగ్ బాస్ ఎంపిక చేస్తాడు. ఈ ముగ్గురిలో ఎవరైతే ఎక్కువ సార్లు గన్ ఫైర్ శబ్దం రాగానే డేరా నుండి బైటికి వస్తారో ఆ ఒక్క వేటగాడు ఈ వారం నామినేషన్ లో ఉండడని, ఇక మిగిలిన ఇంటిసభ్యులు ఎవరైతే ఇంట్లో ఉన్న అరటిపండును మొదట తీసుకొనే ఇద్దరు ఇంటి సభ్యులు ఇంట్లో ఉన్న ఎవరినైనా నామినేట్ చేయగా తుది నిర్ణయం మాత్రం వేటగాడి ఇష్టంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయవచ్చని బిగ్ బాస్ నియమాన్ని పెట్టడం జరిగింది.

ఇక ఆట మొదలైన తరువాత వరుసగా నాలుగుసార్లు సన్నీ డేరా నుండి బయటికి రావడం.., మొదటగా శన్ముక్ జశ్వంత్, సిరి హనుమంత్ లలో శన్ముక్ జశ్వంత్ ఆనీ మాస్టర్ ని, సిరి హనుమంత్ మానస్ ని నామినేట్ చేయాలని చెప్పడం వారిద్దరిలో శన్ముక్ జశ్వంత్ చెప్పిన ఆనీ మాస్టర్ ని నామినేట్ చేయడానికి ఓకే చెప్పగా, ఆ తరువాత సిరి హనుమంత్, ఆనీ మాస్టర్ లలో సిరి హనుమంత్ మరోసారి మానస్ పేరు చెప్పడం, ఆనీ మాస్టర్.. సిరి హనుమంత్ పేరు చెప్పడంతో ఆనీ మాస్టర్ చెప్పిన కారణం నచ్చిన సన్నీ.. తన సిరి హనుమంత్ ని నామినేట్ చేయడం జరిగింది.

కాజల్, సిరి హనుమంత్ ఇద్దరిలో సిరి హనుమంత్ మళ్ళీ అదే కారణం చెప్పడం, కాజల్.. ప్రియని నామినేట్ చేయాలనీ అనుకోవడంతో సన్నీ ప్రియని నామినేట్ చేయడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో ప్రియ.. సన్నీని ఇరుకున పెట్టాలనే ఆలోచనతో ప్లాన్ చేసి సిల్లీ కారణాలతో రవిని నామినేట్ చేయడం, మరో పక్క ప్రియాంక సింగ్.. కాజల్ పేరు చెప్పడంతో తనతోనే ఆటలు ఆడుతున్నారని గమనించిన సన్నీ వారికి షాక్ ఇస్తూ ప్రియ నామినేట్ చేయాలనుకున్న రవిని సన్నీ నామినేట్ చేసి ఇంటి సభ్యులకు షాక్ ఇస్తాడు.

ఇది నా గేమ్ అని.., తనకి ఎవరు ఎలా ఆడాలో చెప్పాల్సిన అవసరం లేదని, రవిని ఆ కారణంతో ప్రియ నామినేట్ చేయడం ఎందుకని.., ఇంట్లో ఉన్న ఎవరినైనా చెయ్యొచ్చు కదా.., తాను గేమ్ ఎవరితో ఆడుతున్నానో అర్ధం అవుతుందంటూ సన్నీ..రవికి నచ్చజెప్పుతూ ఈ వారం అంతా నీకు సపోర్ట్ గా ఉంటానని మాట ఇస్తాడు. సోమవారం నామినేషన్ లో ప్రియ ఆడిన నాటకంలో చివరికి రవి బలి అయిపోయాడని బుల్లితెర ప్రేక్షకులకు అర్ధమైంది. చివరిసారి రవి, ప్రియాంక సింగ్ లు ఇద్దరు కాజల్ పేరును చెప్పడంతో సన్నీ.. కాజల్ ని కూడా నామినేట్ చేయడం జరిగింది.

మొత్తంగా చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుడిగా ఉన్న సమయంలో కత్తి పోట్లు పొడిచిన ప్రతి ఒక్క ఇంటి సభ్యునికి సన్నీ ఈ వారం నామినేషన్ తో తానేంటో చూపించాడు. నువ్వు ఎలా చూసిన ఏమి చేసిన ఫరక్ పడదు అన్న ప్రియాంక సింగ్ కి, సిల్లీ కారణాలు చెప్పతూ నామినేట్ చేసే ప్రియకి, కెప్టెన్ కావాలంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటూ కత్తిపోటు పొడిచిన రవికి తన స్టైల్ లోనే సమాధానం ఇచ్చాడు సన్నీ. నామినేషన్లు అంటే మజాక్ అనుకుంటున్నారంటూ టిట్ ఫర్ టాట్ గేమ్ తో బిగ్ బాస్ ఆటలో పవర్ఫుల్ వేటగాడుగా నిలిచాడు. ఇక ఒక్కసారి కూడా డేరా నుండి బైటికి రాని శ్రీరామచంద్ర, జెస్సీలు కూడా ఈ వారం నామినేట్ అయ్యారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story