Bigg Boss 5 Highlights: ట్విస్టులతో సాగిన ఈ వారం నామినేషన్స్ లో ఆ అయిదుగురు

* బిగ్ బాస్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 9 Nov 2021 11:45 AM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Highlights 08th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం పదో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఈవారం కెప్టెన్ అయిన ఆనీ మాస్ట‌ర్‌ ను ఇంటి సభ్యులలో ఎవ‌రైన నలుగురిని నామినేట్‌ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించాడు. అప్పుడు మానస్‌, కాజల్‌, విజె సన్నీ, శణ్ముఖ్‌ జస్వంత్ లను నామినేట్‌ చేసి జైలులో పెట్టింది ఆనీ మాస్టర్. ఆ తరువాత ఆనీ చేసిన నామినేషన్లని మార్చడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు.

అందులో భాగంగా బజర్ మోగిన తరువాత ఎవరైతే తాళాలను మొదట తీసుకుంటారో ఆ ఇంటి సభ్యుడు వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని జైలు నుండి బయటకు తీసుకురావొచ్చు. అలా జైలు నుండి బయటకు వచ్చిన ఇంటి సభ్యుడు మరో ఇద్దరిని నామినేట్‌ చేస్తే వారిలో ఒకరిని నామినేట్‌ చేసి జైలుకు పంపే అవకాశాన్ని తాళాలు తీసుకున్న ఇంటి సభ్యుడికి ఇస్తాడు.

ఇక మొదటి రౌండ్ లో బజర్ మోగగానే ప్రియాంక సింగ్ వెళ్లి తాళాలను తీసుకుంది. ఆమె మానస్‌ని జైలు నుంచి బయటికి తీసుకొని రాగా మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. చివరగా ప్రియాంక సింగ్ ఇద్దరిలో జెస్సీని ఫైనల్ చేసి జైలుకి పంపి నామినేట్ చేసింది.

రెండో రౌండ్ లో బజర్‌ మోగగానే సిరి తాళాలను పొంది అంతకు ముందుగా మాట్లాడుకున్నట్లుగానే శన్ముఖ్ జస్వంత్ తనని బయటికి తీసుకొని రావొద్దనే చెప్పడంతో జెస్సీని బయటకు తీసుకొచ్చింది. ఇక బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే మానస్‌ని నామినేట్ చేసింది.

మూడో రౌండ్ లో జెస్సీ తాళాలను పొంది శన్ముఖ్ జస్వంత్ ని జైలు నుంచి బయటకు తీసుకురాగా అతడు ప్రియాంక సింగ్, సిరి హనుమంత్ లను నామినేట్ చేయగా వారిద్దరిలో ప్రియాంక సింగ్ జైలుకు వెళ్లింది.

నాలుగో రౌండ్ లో బజర్‌ మోగగానే తాళాలను దక్కించుకొన్న రవి.. ప్రియాంక సింగ్ బయటకు తీసుకొచ్చాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో చివరికి రవి. శన్ముఖ్ జస్వంత్ మళ్లీ జైలు లోపలికి పంపాడు.

ఐదో రౌండ్ లో శ్రీరామ్‌ తాళలను చేజిక్కించుకొని కాజల్‌ని బయటికి తీసుకొని రాగా బయటకు వచ్చిన కాజల్‌.. సిరి, రవిలను నామినేట్‌ చేయగా.. శ్రీరామ్‌ సిరిని ఫైనల్‌ చేసి జైలుకు పంపాడు.

చివరగా తాళాలను దక్కించుకున్న కాజల్.. మానస్‌, సన్నీలలో ఒకరిని బయటకు తీసుకొని రావాలని ప్రయత్నించిన శ్రీరామ్ చెప్పిన మాటలు విని తనకోసం లెటర్‌ త్యాగం చేసిన శన్ముక్ జస్వంత్ ని అయినా బయటకు తీసుకొచ్చింది. ఇక బయటకు వచ్చిన షణ్ముఖ్‌ ఇంటి సభ్యులకు షాక్ ఇస్తూ రవి, శ్రీరామ్‌లను నామినేట్‌ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్.. రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది.నామినేషన్ బజార్ రౌండ్ పూర్తయ్యే సరికి జైలులోనే ఉన్న విజే సన్నీ, మానస్, రవి, సిరి హనుమంత్ లు ఉండగా కెప్టెన్‌ ఆనీ మాస్టర్ కి మరో ఇంటి సభ్యుడిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వడంతో కాజల్‌ని నామినేట్‌ చేసింది. ఇక ఈ వారం నామినేషన్ లో విజే సన్నీ, మానస్, రవి, సిరి హనుమంత్, ఆర్జే కాజల్ నిలిచారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story