Bigg Boss 5: సన్నీ, మానస్ వర్సెస్ ఇంటి సభ్యులుగా మారిన నామినేషన్స్

Bigg Boss 5 Monday Episode Highlights: ఇంటిసభ్యులంతా నామినేషన్ లోకి.. ఈ వారం హౌస్ నుండి వెళ్ళేదేవరో..??

Sandeep Reddy
Updated on: 2 Nov 2021 12:43 PM IST
Bigg Boss Season 5 Telugu Monday Episode Highlights 01st November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Monday Episode Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం ఎపిసోడ్ లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. క్రీమ్ పూయ్యు నామినేషన్ వెయ్యు లో భాగంగా ఈ వారం నామినేషన్ లో కెప్టెన్ షణ్ముఖ్ జశ్వంత్ మినహా ఇంటి సభ్యులు అందరూ నిలిచారు. ఈ వారం నామినేషన్లు మానస్, సన్నీ వర్సెస్ ఇంటి సభ్యులు అన్నట్టుగా సాగింది. మొదటగా నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన మానస్.. శ్రీరామచంద్ర తో పాటు జెస్సిని నామినేట్ చేశాడు.

కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా జెస్సి తన పని సరిగ్గా నిర్వర్తించలేదంటూ నామినేట్ చేయగా.., శ్రీరామచంద్ర రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. ఆ తరువాత సిరి హనుమంత్.. విజే సన్నీతో పాటు ఆని మాస్టర్ ను నామినేట్ చేసింది. విజే సన్నీ.. సిరి హనుమంత్ తో పాటు కెప్టెన్సీ టాస్క్ సంచాలక్ గా జెస్సి సరైన నిర్ణయం తీసుకోలేదని నామినేట్ చేశాడు. ఇక ఇంటి సభ్యుల్లో కొంతమంది సిల్లీ కారణాలతో నామినేట్ చేయడం జరిగింది.

అందులో విశ్వ మూడు వారాల క్రితం జరిగిన ఒక టాస్క్ గురించి ప్రస్తావిస్తూ మానస్ ని నామినేట్ చేయగా.., ప్రియాంక సింగ్ రవి, విశ్వలను బాగా ఆడుతున్నారని మిమ్మల్ని నేను అందుకోలేకపోతున్నని చెప్తు నామినేట్ చేయడం వింతగా అనిపించింది. ఇక మొదటివారం నుండి అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ నామినేషన్స్ తో పాటు టాస్క్ లలో వేరుగా చూసే ఆని మాస్టర్ ఈవారం మాత్రం సిరి హనుమంత్ తో పాటు అర్జె కాజల్ ని విచిత్రమైన కారణాలు చెప్తూ నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. రవి.. అర్జె కాజల్ తో పాటు మానస్ ని నామినేట్ చేయగా, అర్జె కాజల్.. శ్రీరామచంద్ర, రవిని నామినేట్ చేసింది.

చివరగా కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ నామినేషన్ టాస్క్ కంటే ముందు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్లవు అని ప్రియాంక సింగ్ తో చెప్పిన తరువాత నామినేషన్ లో మాత్రం ఆమెకి నీ గేమ్ నువ్వు ఆడు అంటూ సలహా ఇచ్చి నామినేట్ చేయడం ప్రియాంక సింగ్ కి కోపాన్ని తెప్పించింది. నామినేషన్ పూర్తయిన తరువాత సిరి హనుమంత్ సన్నీకి ఎదో క్లారిటీ ఇద్దామని మళ్ళీ మాట్లాడటం ఆ మధ్యలోనే జెస్సి విషయం రావడం.. తాను ఎదో నిరూపించుకోవడం కోసం గాల్లోకి ఎగరడం కాస్త బుల్లితెర ప్రేక్షకులకు కాస్త అతిగా కనిపించింది.

మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా జరిగే టాస్క్ లో గెలుపొందిన ఇంటి సభ్యుడికి ఈ వారం నామినేషన్ నుండి బయటపడటానికి ఇంమ్యూనిటీ లభించే అవకాశం ఉందని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఈ టాస్క్ లో మరొకసారి సన్నీ, మానస్ లతో శ్రీరామచంద్ర మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగినట్టుగా తాజా ప్రోమోలో చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈవారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం..

  • మానస్ - శ్రీరామచంద్ర, జెస్సి
  • విజే సన్నీ - సిరి హనుమంత్, జెస్సి
  • సిరి హనుమంత్ - విజే సన్నీ, ఆని మాస్టర్
  • రవి - అర్జె కాజల్, మానస్
  • శ్రీరామచంద్ర - మానస్, విజే సన్నీ
  • జెస్సి - మానస్, విజే సన్నీ
  • ఆని మాస్టర్ - సిరి హనుమంత్, అర్జె కాజల్
  • విశ్వ - మానస్, ప్రియాంక సింగ్
  • ప్రియాంక సింగ్ - విశ్వ, రవి
  • షణ్ముఖ్ జస్వంత్ - ప్రియాంక సింగ్, మానస్
  • అర్జె కాజల్ - రవి, శ్రీరామచంద్ర
Sandeep Reddy

Sandeep Reddy

Next Story