Bigg Boss 5 Highlights: ఈవారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా "సన్నీ ఆన్ డ్యూటీ"

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 23 Oct 2021 12:45 PM IST
Bigg Boss Season 5 Telugu Friday Episode Highlights 22nd October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Highlights: ఈవారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా "సన్నీ ఆన్ డ్యూటీ"

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ లో కోల్గేట్ ఏర్పాటు చేసిన ఒక టాస్క్ లో ఇంటి సభ్యులు తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకున్నారు.. ఈ టాస్క్ లో జెస్సి విజేతగా నిలుస్తాడు.. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పోటీదారులు అయిన విజే సన్నీ, రవి, మానస్, కాజల్, విశ్వ బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్ కాపాడుకునే టాస్క్ లో ఇంటి సభ్యులు తమకి నచ్చిన పోటీదారుడికి సపోర్ట్ చేయొచ్చని, బజర్ మొగిన వెంటనే గార్డెన్ ఏరియాలో ఉన్న గుండు సూది తీసుకొని తాము సపోర్ట్ చేసే ఎవరో ఒక పోటీదారుడికి ఇవ్వొచ్చని, ఆ పోటీదారుడు తన ప్రత్యర్థి బెలూన్ పగలగొట్టి కెప్టెన్సీ టాస్క్ నుండి ఆ ఇంటి సభ్యుడిని తప్పించే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తాడు.

అందులో భాగంగా మొదట జెస్సీ కాజల్ కి సపోర్ట్ చేసి గుండు సూది ఇవ్వడం.. విశ్వాని తప్పించడం.. ఆ తరువాత లోబో, విశ్వా రెండు సార్లు రవికి సపోర్ట్ చేయడంతో కాజల్.. మానస్ ల బెలూన్ లు పగలగొట్టడంతో చివరికి సన్నీ, రవి ఇద్దరిలో ఆనీ మాస్టర్ సన్నీకి సపోర్ట్ చేయడంతో ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా సన్నీ ఎంపిక అయ్యాడు.

కెప్టెన్ గా నువ్వు కరెక్ట్ కాదు అని రెండు వారాల క్రితం కత్తిపోట్లు పొడిచి చెప్పిన.., టాస్క్ లలో సన్నీని టార్గెట్ చేసి ఆడిన.., అతడిపై నోరుజారి మాట్లాడిన తన మొహంలో మాత్రం చిరునవ్వు చెదరకుండా పట్టుదలతో పోరాడి కెప్టెన్ గా అతన్ని వద్దు అనుకున్న వాళ్ళ దగ్గర నుండే జేజేలు కొట్టించుకొని విజె సన్నీ ఏడవ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచాడు.

మొదటి నుండి ఇంటి కెప్టెన్ అవాలనే కోరికతో పాటు తాను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కెప్టెన్ డ్రెస్ ని వేసుకోవాలనే సన్నీ కోరిక శుక్రవారం ఎపిసోడ్ లో తీరింది. ఇక కెప్టెన్ గా అయిన మొదటి రోజే ప్రియతో తనకున్న విభేదాలను పక్కనపెట్టి ఇంట్లో ఏ పని చేయాలనుకుంటుందో అడిగి ఆమెకి నచ్చిన పనిని సన్నీ కేటాయించడం జరిగింది. కెప్టెన్ అయిన తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా బిగ్ బాస్ అని చెప్పిన సన్నీ.. మరి ఈవారం తన కెప్టెన్ డ్యూటీని ఎలా చేస్తాడో.., కెప్టెన్ అయిన సంతోషంలో ప్రేక్షకులకు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచుతాడో వేచిచూడాల్సిందే..

ఇక శన్ముఖ్ జస్వంత్.. సిరి హనుమంత్, జెస్సీలు కెప్టెన్సీ టాస్క్ లో తనని నమ్మించి మోసం చేశారనే రోజంతా బాధపడుతూనే కనిపించాడు. తాను ఒకవేళ మాట్లాడిన ముందులా మాత్రం మీతో ఉండలేనని జెస్సీకి మొహం మీదే శన్ముఖ్ జస్వంత్ చెప్పేశాడు. సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన లోబో మాత్రం ఎవరికీ సపోర్ట్ చేస్తున్నాడో.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడో.. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధంకాని పరిస్థితిలో అటు ఇంటి సభ్యులే కాకుండా బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story