BB 5 Highlights: చిక్కకుండా దొరకకుండా కెప్టెన్ గా గెలిచిన ఆనీ మాస్టర్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 6 Nov 2021 12:28 PM IST
Bigg Boss Season 5 Telugu Friday Episode Highlights 05th November 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ లో భాగంగా అప్పటికే కొనసాగుతున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్ లో మానస్ అద్భుత ప్రదర్శనతో సూపర్ విలన్స్ టీం సభ్యులను ఓడించి ఆ టాస్క్ లో సూపర్ హీరోస్ విజేతలుగా నిలిచారు. ఆ తరువాత సిరి హనుమంత్ - శన్ముఖ్ జస్వంత్ మధ్య దుస్తులు ఎగరేయడం గురించి కాసేపు ఒకరిని ఒకరు మాట మాట అనుకోవడం జరిగింది.

ఇక మొదటి నుండి మానస్ వెంట పడే ప్రియాంక సింగ్ ని ఎంత దూరం పెట్టాలని చూసిన ఆమె ఏదో విధంగా అతనితో మాట్లాడటం జరిగింది. ప్రియాంక సింగ్ ను మానస్ సిస్టర్ అని పిలిచినా ఆమె మాత్రం తనని అలా పిలిస్తే బాధగా ఉంటుందని చెప్పడం దాంతో మానస్ కి కోపం వచ్చి ఏంటి సీన్ ఎందుకు చేస్తున్నావ్.. ఇప్పుడు తినాలా వద్దా అని అనడంతో బాధతో ప్రియాంక సింగ్ వెళ్ళిపోయి సిరితో ఈ విషయాన్ని పంచుకుంటుంది. ఇక అదే సమయంలో సిరి హనుమంత్.. మానస్ తో ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చిందని రెచ్చగొట్టడం జరిగింది.

ఆ తరువాత మానస్ - ప్రియాంక సింగ్ ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని వారి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలను పరిష్కరించుకున్నారు. ఇక జెస్సీ.. ప్రియాంక సింగ్ కి ముద్దుపెట్టడం చూసి శ్రీరామ్ గట్టిగా నవ్వడం.. అది చూసి సన్నీ ప్రియాంక సింగ్ ని అడగగా ఛీ నేను పెట్టలేదు అనడం జరిగింది. నాలుగు పాయింట్లతో సూపర్ విలన్స్ గెలుపొందటంతో ఇక చివరగా కెప్టెన్సీ పోటీలో భాగంగా బిగ్ బాస్ "చిక్కకు దొరకకు" అనే టాస్క్‌ ఇచ్చాడు‌.

ఈ టాస్క్‌లో కెప్టెనీ​ పోటీదారులైన రవి, ఆనీ మాస్టర్, విజే సన్నీ, విశ్వా, జెస్సీ, సిరి హనుమంత్ లు వెల్‌క్రో జాకెట్‌ ధరించి ఉండాలి. ఇతర ఇంటి సభ్యులు విసిరే బంతులను వారి జాకెట్ కి అంటుకోకుండా తప్పించుకోవాలి. బజర్‌ మోగే సమయానికి ఏ పోటీదారుడికి అయితే ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటాయో ఆ సభ్యుడు పోటీ నుంచి తప్పుకోవాలి. ఇక ఇంటి సభ్యులు విసిరిన బాల్స్ నుంచి తప్పించుకొని అందరికంటే తక్కువ బాల్స్ అంటుకున్న సభ్యుడు కెప్టెన్ అవుతాడు. ఈ టాస్క్ లో అందరికంటే తక్కువ పాయింట్లతో ఆనీ మాస్టర్ విజేతగా నిలిచి ఈ వారం ఇంటి కెప్టెన్ గా నియమించబడింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story