Bigg Boss 5 Updates: బరువు తగ్గేది ఎవరు..కెప్టెన్ గా గెలిచేది ఎవరు..!?

Sandeep Reddy
Updated on: 29 Sept 2021 11:47 AM IST
Bigg Boss Season 5 Telugu 29 09 2021 Episode Highlights
X

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Updates: బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ యాంకర్ రవి గుంటనక్క ఎవరో అంటూ మొదలైన ప్రశ్నకి చివరికి తానే ఆ గుంటనక్క అని ఫిక్స్ అయిన రవి.. తనకి ఆ పేరు పెట్టడం కరెక్టని విశ్వ చెప్పాడని తెలుసుకుని క్లారిఫికేషన్ కోసం వెళ్లగా విశ్వ మాత్రం తాను అలా అనలేదని కెమెరాల ముందు క్లారిటీగా నిజమే చెప్తున్నాను అంటూ యాంకర్ రవికి క్లారిఫికేషన్ ఇస్తాడు.. అయితే ఈ విషయంలో నటరాజ్ మాస్టర్ అబద్ధం చెప్పాడా లేదా విశ్వ నిజం దాచాడా అనే విషయం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున.. ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ కి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో.

ఇక రవి - కాజల్ తో మాములుగా మాట్లాడటానికి ప్రయత్నించిన తనకు నచ్చక అక్కడి నుండి వెళ్లిపోవడం.. తను చేసిన పనికి ఫిజికల్ అనడం కరెక్ట్ కాదు అంటూ బాధపడటం జరిగింది. ఈ విషయాన్ని కాస్త సర్దుమణిగేలా చేద్దామనుకున్న మానస్ మాట కూడా కాజల్ వినకపోవడం మనం చూడొచ్చు.. మరోపక్క షణ్ముఖ్ జస్వంత్, జెస్సిలకు లోబో అతిగా మాట్లాడే పద్ధతి, ప్రవర్తించే తీరు వారిద్దరికి నచ్చట్లేదని వారి మాటల్లో అర్ధం అవుతుంది.

డైనింగ్ హల్ లో శ్రీరామచంద్ర "ప్రేమిస్తే" సినిమాలోని "జన్మ నీదేలే" సాంగ్ పాడటం ఆ పాట విని ఎమోషనల్ అయి ప్రియ కన్నీరు పెట్టుకోవడం.. తను పాడిన పాటని ప్రేమికుల అంకితం ఇస్తున్నాట్లు శ్రీరామ్ చంద్ర చెబుతాడు.. ఆ తరువాత యాంకర్ రవి చెప్పిన మాట విని లోబో తన కోపాన్ని తగ్గించుకొని ప్రియ వద్దకు వెళ్లి సారీ చెప్పగా తను కూడా కూల్ అవడం జరుగుతుంది.

శ్వేతవర్మతో జరిగిన సరదా సంభాషణలో జెస్సి ఆమెని తన గర్ల్ ఫ్రెండ్ గా నేను తన బాయ్ ఫ్రెండ్ గా ఉండేలా ఒక టాస్క్ ఇవ్వమని బిగ్ బాస్ ని కోరడం అంతేకాకుండా వారిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేయమని చెప్తూ ఓవర్ యాక్షన్ చేసిన జెస్సిని చూస్తే శ్వేత వర్మని ఫ్లర్ట్ చేస్తున్నాడా లేదా పిల్లోడిలా ప్రవర్తిస్తున్నాడో ప్రేక్షకులకు అర్ధం కాలేదు.

హౌస్ లో నుండి ఫుడ్ కి సంబంధించిన అన్నింటిని బిగ్ బాస్ తీసుకెళ్తున్న సమయంలో సంతోషపడుతున్న అర్జె కాజల్ పై సన్నీ ఫైర్ అవుతాడు.. ఫుడ్ విషయంలో జోకులు అవసరం లేదని, అన్నిసార్లు తీసుకువెళ్తున్నందుకు ఎస్ ఎస్ అనడం కరెక్ట్ కాదని సన్నీ అనగానే జెస్సి మధ్యలో జోక్యం చేసుకోవడం ఆ విషయంలో జెస్సిని విశ్వాసం లేదు రా నీకు అని సన్నీ క్లాస్ పీకడం చూడొచ్చు.

కెప్టెన్సి టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులను జంటలుగా విడిపోవాలని ఆదేశించగా ఒక్కొక్కరు తనకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు.. అందులో నటరాజ్ మాస్టర్ - లోబో, సన్నీ - మానస్, రవి - విశ్వ, శ్రీరామ్ - హామీదా, ప్రియ - ప్రియాంక, జెస్సి - కాజల్, షణ్ముఖ్ - సిరి, ఆని మాస్టర్ - శ్వేత వర్మలు జంటలుగా ఉంటారు..

బిగ్ బాస్ కెప్టెన్సి పోటీదారుల కోసం ఇచ్చిన "గెలవాలంటే తగ్గాల్సిందే" టాస్క్ లో భాగంగా ఎవరైతే ఇంటి సభ్యుల జంట ఎక్కువగా బరువు తగ్గడంతో పాటు.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలుపొందిన జంట మరో 500 గ్రాముల బరువును తగ్గుతుందని, ఓడిన జంట 500 గ్రాముల బరువు పెరుగుతుందని బిగ్ బాస్ తన నియమాలను చెబుతాడు.

ఈ టాస్క్ లో మొదట పవర్ బటన్ ని నటరాజ్ మాస్టర్ టచ్ చేయడం.. ఆ తరువాత పవర్ రూమ్ లోకి వెళ్లిన లోబో - నటరాజ్ మాస్టర్.. తమకు ప్రత్యర్థి జంటగా శ్రీ రామ్ చంద్ర - హామీదని ఎంచుకోవడం, ఆ టాస్క్ లో లోబో - నటరాజ్ మాస్టర్ ఓడిపోవడం జరుగుతుంది.

ఇక హౌస్ మేట్స్ తమ బరువుని తగ్గించుకోవడానికి పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి.. అందులో ముఖ్యంగా లోబో కామెడీ, నటరాజ్ మాస్టర్ చేసిన అతి.. మంగళవారం ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరి బుధవారం జరిగే ఎపిసోడ్ లో ఏ జంట బరువును తగ్గి.. కెప్టెన్సీ బాధ్యతను చేజిక్కించుకుంటుందో చూడాల్సిందే..!!

Sandeep Reddy

Sandeep Reddy

Next Story