BB5 Highlights: మ్యారేజ్ బ్రోకర్ గా శన్ను.,మతిమరుపుతో రవి., ఫన్నీగా సన్నీ అదుర్స్

BB5 Highlights: మ్యారేజ్ బ్రోకర్ గా శన్ను.,మతిమరుపుతో రవి., ఫన్నీగా సన్నీ అదుర్స్
BB5 Telugu Latest Episode: మంగళవారం నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కొనసాగింపులో భాగంగా విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప...
BB5 Telugu Latest Episode: మంగళవారం నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కొనసాగింపులో భాగంగా విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియని నామినేట్ చేయగా, షణ్ముఖ్ జశ్వంత్ ప్రియ,లహరి షరిని నామినేట్ చేశాడు. చివరగా ఈ వారం ప్రియ, శ్రీరామచంద్ర, ప్రియాంక, మానస్, లహరి నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. నామినేషన్ టాస్క్ ముగిసిన తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు హైదరాబాదీ అమ్మాయి, అమెరికా అబ్బాయి టాస్క్ లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యునికి ఒక్కో పాత్ర పోషించాలని టాస్క్ ఇవ్వడం జరిగింది.
ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులలో అందరికంటే విజే సన్నీ ఫన్నీగా తన పాత్రని పోషించి హౌస్ లో నవ్వులు పూయించాడు. అటు ప్రియాంక సింగ్ తో పాటు అర్జె కాజల్ తో జరిగిన సంభాషణలో చాలా తెలివిగా బిగ్ బాస్ 5 హౌస్ లోని అన్ని స్పాన్సర్షిప్ బ్రాండ్ లను చెబుతూ.. మనదే ఇదంతా అంటూ అమెరికన్ బిజినెస్ మ్యాన్ లా బుల్లితెర ప్రేక్షకులను సన్నీ ఫన్నీగా నవ్వించాడు..ఇక షణ్ముఖ్ జస్వంత్ పంతులు క్యారెక్టర్ లో కామెడీ చేస్తూనే ఈవెంట్ మేనేజర్ లోబోకి అసిస్టెంట్ గా ఉన్న శ్వేతవర్మని ప్రేమలో పడేయడానికి నానా తంటాలు పడ్డాడు.
లహరితో పెళ్లి కోసం మానస్, శ్రీరామచంద్రలలో ఎవరిని సెట్ చేయాలో.., ఎవరిని కట్ చేయాలో శన్ముఖ్, లోబోలు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. యాంకర్ రవి లహరికి మామగా మతిమరుపు క్యారెక్టర్ లో ఉంటూ తానే లహరిని పెళ్లి చేసుకోవాలని, పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచిస్తూ తనని తానే మర్చిపోతూ చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా బుధవారం విడుదలైన ప్రోమోలో శన్ముఖ్ జశ్వంత్, శ్వేతవర్మ మధ్య ప్రేమాయణం.. ఆ సమయంలోనే శన్ముఖ్ టంగ్ స్లిప్ అయి ఏమైనా అన్నామంటే మొహంపై పెయింట్ వేసి కొడుతారంటూ శ్వేతావర్మని అనడంతో ఆమె బాధపడటం..అలా అన్నందుకు శన్ముఖ్ క్షమాపణ చెప్పడం ఈరోజు ఎపిసోడ్ లో చూడవచ్చు. మరోపక్క యాంకర్ రవిని బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్ కి పిలిచి కెప్టెన్సి టాస్క్ కోసం పోటీదారుడిగా నిలవడానికి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం..ఆ టాస్క్ లో రవి ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే..!!
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Russia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMTSeediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
29 May 2022 10:00 AM GMT