BB5 Updates: మానస్ బెస్ట్.. జెస్సి వరస్ట్.. ఎంటర్టైన్మెంట్ మాత్రం సన్నీదే

Sandeep Reddy
Updated on: 2 Oct 2021 12:47 PM IST
Bigg Boss 5 Telugu 1st October 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

 బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ నటరాజ్ మాస్టర్ నత్త టాపిక్ తో మొదలై సన్నీ ఇంటి సభ్యులను అనుసరిస్తూ చేసిన కామెడీకి నవ్వులతో ముగిసింది. నటరాజ్ మాస్టర్ గత కొన్ని రోజులుగా హౌస్ మేట్స్ ని రకరకాల జంతువుల పేర్లు పెట్టి పిలవడంతో అతనికి సోషల్ మీడియాలో జంతు పిత శాస్త్రవేత్త అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ మాటలకు అలసిపోయిన యాంకర్ రవి ఇంటి సభ్యుల ముందు "నీకు ఎందుకు రా నా" గురించి అని నటరాజ్ మాస్టర్ ని ఉద్దేశించి అనడం చూడొచ్చు.

ఇక బెస్ట్ పెర్ఫర్మార్ గా మానస్.. వరస్ట్ పెర్ఫర్మార్ గా జెస్సిని ఇంటి సభ్యులు ఎంచుకున్నారు. జెస్సిని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేయడం నచ్చని శన్ను, సిరి, కాజల్ నిరాశ చెందుతారు. బిగ్ బాస్ ఇచ్చిన ఒలివా క్లీన్ బ్యూటీ టాస్క్ లో భాగంగా పార్టిసిపేట్ ప్రియ, ప్రియాంక, సిరి, హమిదా చేయగా అందులో ప్రియ గెలుపొంది బ్యూటీ హంపర్ ని గెలుచుకుంటుంది.

ఆ తరువాత ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో భాగంగా శ్రీరామ్ చంద్ర గెస్ట్ గా.., విజే సన్నీ యాంకర్ గా ఉండి ఇంటి సభ్యులు శ్రీ రామచంద్రని అడిగిన ప్రశ్నలతో పాటు సన్నీ తన టైమ్లీ కామెడీతో ఇంటి సభ్యులను ఫుల్ గా ఎంటర్ చేశారు. ఆ తరువాత సన్నీ బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఒక్కోక్కరిని అనుసరిస్తూ చేసిన కామెడీ శుక్రవారం ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story