BB5 Latest Promo: ఫన్ గా సాగిన సండే ఎపిసోడ్..ఆ ఇద్దరిలో ఉండేదెవరో..?

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆదివారం ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 25 Oct 2021 12:13 PM IST
Bigg Boss Season 5 Sunday Latest Promo Released 24th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. మొదటి ప్రోమోలో బిగ్ బాస్ షీల్డ్ ని స్పెషల్ పవర్ కోసం గెలుపొందటానికి ఇంటి సభ్యులతో నాగార్జున సరదగా కొన్ని టాస్క్ లు చేయించనున్నాడు. ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులపై తనదైన శైలిలో కౌంటర్ లు వేస్తూ సండే ఎపిసోడ్ ని ఫన్ డే ఎపిసోడ్ గా మార్చనున్నాడు.

శనివారం ఎపిసోడ్ లో ఈ వారం నామినేషన్ లో ఉన్న శ్రీరామచంద్ర, కాజల్ సేవ్ అవగా, ఆదివారం ఎపిసోడ్ లో సిరి హనుమంత్, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, లోబో, రవిలలో ప్రియ, ఆనీ మాస్టర్ మినహా నామినేషన్ లో ఉన్న మిగిలిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు.

రెండో ప్రోమోలో ఆనీ మాస్టర్, ప్రియలను ఇంటి సభ్యులకు గుడ్ బై చెప్పి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్స్ లలోకి వెళ్ళాలని నాగార్జున చెబుతాడు. ఆ బాక్స్ లో లైట్స్ ఆగిపోయిన తరువాత ఎవరు ఎలిమినేట్ అయ్యారో.. ఎవరు సేవ్ అయ్యారో చూడమని నాగార్జున చెప్పడం.. ఆ తరువాత బాక్స్ లలో ఆనీ మాస్టర్, ప్రియలు ఇద్దరు లేకపోవడంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు. ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో ఆనీ మాస్టర్.. ప్రియలలో ఎవరు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లనున్నారో ఆదివారం ఎపిసోడ్ లో చూడనున్నాము.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story