Bigg Boss Hari Teja: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ

Bigg Boss Hari Teja: 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది.

Kranthi
Updated on: 6 April 2021 5:53 PM IST
Bigg Boss Fame Hari Teja Blessed with Baby Girl
X

Bigg Boss Hari Teja:(File Image) 

Bigg Boss Hari Teja: యాంకర్ గా, నటిగా బుల్లితెరతో పరిచయం అయి తరువాత వెండితెరలో నటిస్తూ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హరితేజ. అనంతరం బిగ్ బాస్-1 లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ భామ. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షోలో హరితేజకు మంచి గుర్తింపు వచ్చింది. లౌడ్ స్పీకర్ అంటూ ఈమెకు ముద్దుపేరు కూడా పెట్టాడు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బేబీ బంప్తో ఫోటోలు పోస్ట్ చేస్తుంది హరితేజ. ఇప్పుడు ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సన్నిహితులతో, అభిమానులతో ఈ విషయం పంచుకుని సంతోషంలో మునిగిపోయింది హరితేజ.

గతేడాది లాక్‌డౌన్ సమయంలో గర్భం దాల్చింది ఈమె. అప్పట్లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది హరితేజ. ఆ తర్వాత రెగ్యులర్‌గా గర్భంతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చింది. కొన్ని రోజులుగా అలా పోస్ట్ చేయడం ఆపేసింది. ఎప్రిల్ 5న ఈమెకు అమ్మాయి పుట్టింది. 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. దాంతో హరితేజకు నెటిజన్ల నుంచి అభినందనలు వస్తున్నాయి. బుల్లితెరపై సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. అ..ఆ సినిమాలో పని మనిషిగా నటించిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2015లో ఆమె దీపక్ అనే కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది హరితేజ. రెండేళ్లుగా ఈమె పెద్దగా కనిపించడం లేదు. గర్భం కారణంగా ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. నిండు గర్భంతో కూడా డాన్సులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఈమెకు పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లాక్‌డౌన్ ముందు వరకు కూడా బిజీగానే ఉన్న హరితేజ.. లాక్ డౌన్‌లో మాత్రం ఇంటికే పరిమితం అయిపోయింది. చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చినా కూడా గర్భం దాల్చడంతో వాటికి దూరంగా ఉండిపోయింది.

Kranthi

Kranthi

Next Story