Bigg Boss: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. మిడ్‌ వీక్‌‌లో ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss Season 7: బిగ్ బాస్‌ సీజన్‌-7 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఇంకా 6గురు కంటెస్టెంట్స్ మిగిలారు.

Arun Chilukuri
Published on: 13 Dec 2023 5:16 PM IST
Bigg Boss Final Week Elimination and Finalist Contestants Check Here
X

Bigg Boss: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. మిడ్‌ వీక్‌‌లో ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss Season 7: బిగ్ బాస్‌ సీజన్‌-7 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఇంకా 6గురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక విజేత ఎవరో తెలసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఫైనలిస్టుల గురించి బిగ్‌బాస్‌ ఆడియన్స్‌కు వివరిస్తున్నారు.

మొత్తంగా ఈ వారం చాలా ఎమోషనల్‌‌గా మార్చేశాడు బిగ్ బాస్. తొలి రోజు అమర్, అర్జున్‌ వీడియోలను చూపించి ఏడ్చేలా చేశారు. ఇక రెండో రోజు శివాజీతో మొదలు పెట్టి, ప్రియాంక వరకు అందరి జర్నీలను చూపించి, గుండె బరువు ఎక్కేలా చేశారు. ఇక మూడో రోజు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌ జర్నీలను ఆడియన్స్‌కు చూపించేందుకు సిద్ధమయ్యారు.

మిడ్‌ వీక్‌లో బిగ్ బాస్ హౌస్ వీడేది ఎవరు?

అయితే, ఈ వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంది. మరీ వారం మధ్యలో హౌస్‌ను వీడేదెవరో చూడాలి. టాప్‌-5లో ఎవరు ఉంటారోనని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా విజేత ఎవరు అనేది ఆదివారం తెలియనుంది. ప్రస్తుతానికి అయితే, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్‌ టాప్‌-5లో నిలుస్తారని అంతా భావిస్తున్నారు. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లో ఒకరు బిగ్ బాస్ హౌస్ వీడడం పక్కా అని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story