Samrat & Sri Likitha Marriage: బిగ్ బాస్ సామ్రాట్ రెండవ వివాహం

Samrat & Sri Likitha Marriage: బిగ్ బాస్ సామ్రాట్ రెండవ వివాహం
x
Highlights

Samrat Reddy & Sri Likitha Second Marriage : బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను...

Samrat Reddy & Sri Likitha Second Marriage : బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వివాహమాడాడు. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దీప్తి సునైనా, తనిష్ సహా పలువురు హాజరయ్యారు. సామ్రాట్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడంటూ మొదటి భార్య హర్షిత కేసు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు సామ్రాట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అలరించిన సామ్రాట్ బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ తరవాత కొన్ని సినిమాల్లో నటిస్తున్న సామ్రాట్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories