Bangarraju Movie: బంగార్రాజు సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ..!?

admin1
Updated on: 4 Aug 2021 12:24 PM IST
Bigg Boss Contestant Monal Gajjar in Nagarjuna Bangarraju Movie
X

బంగార్రాజు లో మోనాల్ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Bangarraju Movie: అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు మెరిసిన గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 తో మరింత పాపులర్ గా మారింది. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మోనాల్ కు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఆఫర్లు ఏమి రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఒక డ్యాన్స్ షో కు జడ్జిగా వ్యవహరించిన మోనాల్ గజ్జర్ కు టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలో నటించే అవకాశం దొరికినట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ప్రస్తుతం తన సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమా తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో "యమగోల", "యమలీల" సినిమాల కాన్సెప్ట్ మీద ఒక వినోదాత్మకమైన సీన్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కామెడీ సీన్లు మరియు ఒక పాట ఉన్న ఈ ఎపిసోడ్ స్వర్గం బ్యాక్ డ్రాప్ తో నడవనుందట. ఈ ఎపిసోడ్ కోసం మోనాల్ గజ్జర్ ఒక మంచి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య మరియు కృతి శెట్టి కూడా కీలక పాత్రలు పోషించారు.

admin1

admin1

Next Story