Karate Kalyani: కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసుల కేసు నమోదు!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసుల కేసు నమోదు!
Karate Kalyani: లేడీ కమెడియన్ గా తనకంటూ టాలీవుడ్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఈమధ్య టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంటుంది. ఈ మధ్యనే బిగ్ బాస్ షోలో కూడా కనిపించిన కరాటే కళ్యాణి ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఈమె పై కేసు నమోదైంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీకి చెందిన ఒక మైనర్ బాలిక హత్య కేసు నడుస్తోంది. అయితే ఈ కేసు కి సంబంధించిన వివరాలన్నీ కరాటే కళ్యాణి లీక్ చేసిందని సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం కూడా చేసిందని నితీష్ అనే ఒక వ్యక్తి ఈమెపై కంప్లైంట్ నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులో కరాటే కళ్యాణి పేరు మీద ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు జగద్గిరి గుట్ట పోలీసులకు ఆదేశాలు పంపగా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కరాటే కల్యాణి కి ఈ మైనర్ బాలిక హత్య కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని వివరాలు ఇంకా తెలియలేదు. ఇక ఈ మధ్యనే కళ్యాణి బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి జండా పట్టుకుంది. అలాగే మా ఎన్నికల్లో కూడా విష్ణు తరఫున సెక్రెటరీగా పోటీ చేసింది. అయితే ఈ కేసు విషయంలో కరాటే కళ్యాణి ఇంకా రియాక్ట్ అవ్వాలి ఉంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT