భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Bindu Madhavi: 50 లక్షలు ఇస్తేనే సినిమా అంటున్న బిందు మాధవి

Jyothi
Published on: 31 May 2022 1:09 PM IST
Bigg Boss Beauty Demanding Huge Remuneration
X

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ 

Bindu Madhavi: "ఆవకాయ్ బిర్యానీ" సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బిందు మాధవి ఆ తర్వాత తెలుగు మరియు తమిళ భాషలలో చాలా సినిమాలు చేసింది కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మాత్రం అందుకోలేకపోయింది. 2017 లో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 కి వెళ్ళిన బిందుమాధవి ఫైనల్స్ దాకా వెళ్ళింది. తాజాగా తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వెళ్ళిన బిందుమాధవి ఈసారి టైటిల్ ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో గెలిచిన మొట్టమొదటి మహిళా కంటెస్టెంట్ గా బిందుమాధవి అందరి ఆదరణ అందుకుంది.

బిగ్ బాస్ తర్వాత ఈమెకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బిందుమాధవి ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమాకి గాను బిందుమాధవి 50 నుంచి 60 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో సినిమాకి 70 వేల నుంచి 1.25 లక్షల వరకు తీసుకునే ఈ భామ ఇప్పుడు భారీగా తన రెమ్యునరేషన్ పెంచేసింది. మరి అంత రెమ్యూనరేషన్ ఇచ్చి బిందుమాధవి కి సినిమా ఆఫర్ ఎవరైనా ఇస్తారో లేదో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story