Bigg Boss 9 : సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ జంట బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందా ? అసలు వాళ్లెవరు

Bigg Boss 9 A Sensational Political Couple to Enter the House?
x

Bigg Boss 9 : సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ జంట బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందా ? అసలు వాళ్లెవరు 

Highlights

Bigg Boss 9 : సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ జంట బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందా ? అసలు వాళ్లెవరు

Bigg Boss 9 : బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో, ఈసారి మరిన్ని కొత్త మార్పులతో, కొత్త కొత్త కంటెస్టెంట్లతో రాబోతోంది. ఈసారి సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న వారిని బిగ్ బాస్ టీం ఎంపిక చేసింది. ఈసారి ఒక సంచలన జంటను కూడా ఇంట్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 8తో పోలిస్తే ఈసారి షోలో అనేక మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. గత సీజన్ల మాదిరిగానే, ఈసారి కూడా సీరియల్ నటులు, సినిమా సెలబ్రిటీలను బిగ్ బాస్ టీం ఎంపిక చేసింది. అయితే, ఈసారి ట్రెండింగ్ అయిన ఒక జంట బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారని తెలుస్తోంది. వీరు ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఆంధ్రప్రదేశ్‌లో బాగా ఫేమస్ అయ్యారు.

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గతంలో కుటుంబ కలహాల కారణంగా వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ విడిగా వేరే వారిని వివాహం చేసుకున్నప్పటికీ, కలిసి ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. వారి సంబంధంపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ జంట బిగ్ బాస్ గేమ్ షోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ జంట బిగ్ బాస్ ఇంట్లోకి వస్తే ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన షో ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories