Bigg Boss 8 Telugu: అర్థరాత్రి 2 గంటలకు పృథ్వీతో విష్ణుప్రియ చిట్‌చాట్‌.. మాజీ ప్రియుడి గురించి చర్చ..!

Bigg Boss 8 Telugu Day 87: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్నకొద్దీ ఆసక్తికరంగా మారింది. టికెట్‌ టు ఫినాలే రేస్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Nov 2024 10:54 AM IST
Bigg Boss 8 Telugu Contestant Vishnu Priya About her Breakup Story
X

Bigg Boss 8 Telugu: అర్థరాత్రి 2 గంటలకు పృథ్వీతో విష్ణుప్రియ చిట్‌చాట్‌.. మాజీ ప్రియుడి గురించి చర్చ..!

Bigg Boss 8 Telugu Day 87: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్నకొద్దీ ఆసక్తికరంగా మారింది. టికెట్‌ టు ఫినాలే రేస్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. మాజీ కంటెస్టెంట్స్‌ హౌజ్‌లోకి వచ్చి ప్రస్తుత కంటెస్టెంట్స్‌కి టాస్క్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు రోజులు ఇలా సాగాయి. తాజాగా బుధవారం ఎపిసోడ్‌లో మానస్, ప్రియాంకలు హౌజ్‌లోకి రాగా అవినాష్‌ గెలిచాడు. ఇదిలా ఉంటే ఇలా బుధవారం ఎపిసోడ్‌ సందడిగా ముగియగా.

బుధవారం టెలికాస్ట్‌ అయిన ఎపిసోడ్‌లో విష్ణుప్రియ అర్థరాత్రి 2 గంటలకు ప్రృథ్వీతో మాట్లాడింది. అతని బెడ్‌పైకి వెళ్లిన విష్ణు ప్రియ.. తన ఎక్స్‌బాయ్‌ ఫ్రెండ్ గురించి బ్రేకప్‌ స్టోరీ గురించి పంచుకుంది. ఈ సందర్భంగా విష్ణుప్రియ కాస్త ఎమోషనల్‌కు గురైందని చెప్పాలి. ఇప్పటికీ తన మాజీ ప్రేమికుడిని చూడాలనిపిస్తుందంటూ వాపోయింది. తన మాజీ ప్రేమికుడిపై ఉన్న ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసింది విష్ణుప్రియ.

తన తల్లి స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి అతడ్ని చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. తన అమ్మ కౌగిలింతలో లభించిన ప్రేమ, మళ్లీ మాజీ ప్రియుడి హగ్స్‌లో పొందానని అంది. ఇక అతన్ని చూడాలని ఉందని, అతనే తన బలం అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. తనను ఎలా చూసుకునేవాడో వివరిస్తూ ఒకింత ఎమోషన్‌ అయ్యింది.

ప్రృథ్వీతో మాట్లాడుతూ.. తన మాజీ ప్రియుడు కలలో వచ్చాడని ఈ కథంతా చెప్పుకొచ్చింది. ఇక ప్రృథ్వీ బదులిస్తూ.. అతను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా అంటూ ప్రశ్నించాడు. అయితే విష్ణుప్రియ మాత్రం ఆ బ్రేకప్‌ నుంచి మూవ్‌ అయ్యాయనని తెలిపింది. ఇక తనకోసం తప్పులు చేశాడని.. అవి తెలిస్తే భరించలేను అని దాచి పెట్టాడు.. కానీ తెలిశాక నిజంగానే భరించలేకపోయా.. రెండు సార్లు తప్పులు చేశాడు.. అవి నాకు చెప్పేంత గట్స్ లేవు.. అలాంటప్పుడు వద్దు అని అనుకున్నానని తన ప్రేమ కథను చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story