Bigg Boss 8 Telugu: ఈ ఏడుపు గోలెంటీ సామీ.. హౌజ్‌లో ఏరులై పారుతోన్న కన్నీళ్లు..!

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హౌజ్‌ అంటేనే అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2024 10:00 AM IST
Bigg Boss 8 Telugu Bigg Boss House Becomes Very Emotional After Naga Manikanta Cries
X

Bigg Boss 8 Telugu: ఈ ఏడుపు గోలెంటీ సామీ.. హౌజ్‌లో ఏరులై పారుతోన్న కన్నీళ్లు..!

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హౌజ్‌ అంటేనే అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. ముఖ్యంగా హౌజ్‌మేట్స్‌ మధ్య గొడవలు, అలకలు, అంతలోనే సంతోషాలు, ఒకరిపై మరొకరు చూపించే ప్రేమ ఇలా రకరకాల ఎమోషన్స్‌తో నిండి ఉంటుంది. ఇక హౌజ్‌మెట్స్‌ ఏడుపులు కూడా సర్వసాధారణం. అయితే తాజాగా గడిచిన రెండు రోజులుగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో కనీళ్ల వరద కురుస్తోంది.

ముఖ్యంగా మణికంఠ తన గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. ప్రతీసారి ఎమోషనల్‌ అవుతూ అందరినీ ఏడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నిన్నటి ఎపిసోడ్‏లోనూ మరోసారి ఏడ్చేశాడు. మిగతా హౌజ్‌మేట్స్‌ ఎంత ధైర్యం చెబుతున్నా మణికంఠ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. విష్ణుప్రియ మణికంఠను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా ఆగని మణికంఠ తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత తన భార్య తనను యాక్సెప్ట్‌ చేయదంటూ వాపోయాడు. తనది నెగిటివ్‌ మైండ్ సెట్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా కాదు తను అర్థం చేసుకుంటుంది అంటూ విష్ణు ప్రియ ఎంత సర్ది చెప్పినా మణికంఠ మాత్రం బోరున ఏడ్చేశాడు. మొత్తానికి గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో మణికంఠ ఎడుపుతో ప్రేక్షకులు సైతం బోర్‌గా ఫీలయ్యారు. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తుంటే ఈ ఏడుపుల గోలంటీ బాబు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే మణికంఠ విషయంలో నిఖిల్‌ సైతం ఏడ్చేశాడు. మణికంఠ కోసం తనకు ముందుకు రాకపోతే వేరెవాళ్లు ఎవరూ అతడిని సెలక్ట్‌ చేయరంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో మరోసారి ఎమోషన్‌ డోస్‌ పెరిగింది. అయితే ఈ వ్యవహారం తర్వాత మణికంఠ ఆలోచనల్లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపించింది. హౌజ్‌ మేట్స్‌తో మాట్లాడం స్టార్ట్ చేశాడు. ప్రేరణ మాట్లాడుతూ.. నువ్వు ఇప్పటికే స్పేస్ తీసుకోవడం అందరూ చూసేశారు. ఇక అందరితో కలవడం చూస్తే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చింది.

ఇదే క్రమంలో ఆదిత్య కూడా మణికంఠ దగ్గరికొచ్చి మాట్లాడాడు. నీ లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు.. హార్ట్ ఫెల్ట్ గా నీకు కనెక్ట్ అయ్యాను.. జనాలు నిన్ను కాపాడతారు అంటూ ధైర్యం చెప్పాడు ఆదిత్య. దీంతో మళ్లీ ఏడుపు మొదలెట్టాడు మణికంఠ. నేను ఈరోజు నుంచి ఏడవను అంటూనే మళ్లీ మళ్లీ కెమెరా ముందు ఏడ్చేశాడు. మొత్తం మీద నిన్నటి ఎపిసోడ్‌ ఇలా ఏడుపులతో సాగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story