Bigg Boss 8 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు.? డేంజర్‌లో ఆ ఇద్దరు..

Bigg Boss 8 Telugu 11th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజ్‌ చివరి దశకు చేరుకుంటుంది. వారాలు గడుస్తోన్న కొద్దీ బిగ్‌బాస్‌ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2024 11:08 AM IST
Bigg Boss 8 Telugu 11th Week Elimination, Vishnu Priya out From House Reports say
X

Bigg Boss 8 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు.? డేంజర్‌లో ఆ ఇద్దరు..

Bigg Boss 8 Telugu 11th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజ్‌ చివరి దశకు చేరుకుంటుంది. వారాలు గడుస్తోన్న కొద్దీ బిగ్‌బాస్‌ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. తాజాగా సాగిన ఫ్యామిలీ వీక్‌ ఎమోషనల్‌గా సాగింది. హౌజ్‌మేట్స్‌ కుటుంబ సభ్యులు బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వారమంతా ఎమోషనల్‌గా సాగింది. ఇక వారంతం రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నాన్న అంశంపై ఆసక్తి పెరిగింది.

11వ వారం గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్, యష్మీ గౌడ, అవినాష్, విష్ణుప్రియ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. దీంతో ఎవరు హౌజ్‌ నుంచి బయటకు వెళ్తారన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. నామినేషనలో ఉన్న వారిలో గౌతమ్‌ అత్యధిక ఓటింగ్‌తో టాప్‌1లో కొనసాగుతున్నాడు. దీంతో గౌతమ్‌కు ఎలాంటి డోకా లేదని చెప్పాలి. కాగా గౌతమ్‌ తర్వాత యష్మీ రెండో స్థానంలో, మూడో స్థానం టేస్టీ తేజకు దక్కగా.. నాలుగో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడు.

ఇక చివరి రెండు స్థానాల్లో అవినాష్‌, విష్ణుప్రియ ఉన్నారు. దీంతో వీరిద్దరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే వీరిద్దరిలో విష్ణుప్రియ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీనికి కారణం ఈ వారం అవినాష్ రెండో సారి మెగా చీఫ్ కావడమే అని తెలుస్తోంది. దీంతో అందరికంటే తక్కువగా ఓటింగ్‌ దక్కించుకున్న విష్ణుప్రియ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కావడం ఖాయమని స్పష్టమవుతోంది.

నిజానికి మొదటి నుంచి విష్ణుప్రియ ఓటింగ్ విషయంలో బాగానే ఉంది. అయితే క్రమంగా ఓటింగ్‌ తగ్గుతూ వచ్చిది. పృథ్వీతో చేసే లవ్ ట్రాక్ కారణంగా ఆమె గ్రాఫ్ చాలా పడిపోయినట్లు వాదనలు ఉన్నాయి. సోషల్‌ మీడియా వేదికగా విష్ణు ప్రియకు సంబంధించి పెద్ద ఎత్తున ఇదే చర్చ జరగుతోంది. మరి ఈ వారం నిజంగానే విష్ణుప్రియ ఎలిమినేట్‌ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story