Bigg Boss 7 Telugu: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. పాపం.. రతికా కోసం ఈసారి బలయ్యేది ఆయనేనా?

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది.

Arun Chilukuri
Published on: 11 Nov 2023 10:59 AM IST
Bigg Boss 7 Telugu Voting Bhole Shavali and Rathika Rose in Danger Zone in 10th Week
X

Bigg Boss 7 Telugu: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. పాపం.. రతికా కోసం ఈసారి బలయ్యేది ఆయనేనా?

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం 10వ వారం చివరకు చేరింది. ప్రస్తుతం ఎలిమినేషన్‌ చర్చ మొదలైంది. ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే రచ్చ మొదలైంది. ఓటింగ్ ఎవరి ఊహలకు అందకుండా ఉంటోంది. ఇక 10వ వారం నామినేషన్స్‌లో మొత్తం 5గురు ఉన్నారు. శివాజీ, రతికా రోజ్‌, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్‌ యావర్, భోలే షావలి నామినేషన్స్‌‌లో ఉన్నారు.

ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్‌లో శివాజీ అగ్రస్థానంలో దూసుకపోతున్నాడు. 33.85 శాతం ఓట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత నటుడు గౌతమ్‌ కృష్ణ 16.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రిన్స్‌ యావర్‌ 16.67 శాతం ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు.

నాలుగో ప్లేస్‌లో పాట బిడ్డ భోలే షావళి 16.58 శాతం ఓట్లతో నిలిచాడు. రతికా రోజ్‌ 16.13 శాతం ఓట్లతో 5వ స్థానంలో నిలిచాడు. దీంతో భోలే, రతిక డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే, 10వ వారం రతిక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇక బిగ్‌ బాస్‌ రతికను సేవ్ చేయాలని అనుకుంటే మాత్రం భోలేకి షాక్ తగలక తప్పదు. తొలిసారి ఎలిమేట్ అయింది. అయితే, లక్ కొద్ది హౌస్‌లోకి తిరిగి వచ్చింది. అయితే, రెండోసారి వచ్చినా.. జనాల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. అలాగే ఓటింగ్‌లోనూ చాలా తక్కువుగా వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలిమినేషన్ అవ్వక తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story