Damini Bhatla Remuneration: సింగర్ దామిని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ కామెంట్సే‌ కొంపముంచాయా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో వారం వారం సమీకరణాలు మారుతున్నాయి. ప్రతీవారం ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంటారు.

Arun Chilukuri
Updated on: 25 Sept 2023 8:30 PM IST
Bigg Boss 7 Telugu Singer Damini Bhatla Remuneration and Elimination Check Here Full Reasons
X

Damini Bhatla Remuneration: సింగర్ దామిని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ కామెంట్సే‌ కొంపముంచాయా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో వారం వారం సమీకరణాలు మారుతున్నాయి. ప్రతీవారం ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంటారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ప్రముఖ సింగర్ దామిని ఈ వారం ఎలిమినేషన్ అవుతుందని వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ హౌస్‌లో దామిని ఎక్కువగా ఒక్క ప్లేస్‌కే పరిమితమైందంట. దీంతోపాటు, యావర్‌ను మతపరమైన కామెంట్స్ చేయడంతో ఓటింగ్ చాలా తక్కువగా వచ్చాయి. దీంతో మూడో వారం అనుకున్నట్లుగా బిగ్ బాస్ హౌస్ నుంచి దామిని ఎలిమినేషన్ అయింది.

కిచెన్‌ వార్డెన్..

కాగా, దామిని ఎక్కువగా కిచెన్‌కు పరిమితం అవ్వడం, హౌస్ మెంబర్స్‌కు వండిపెడుతోంది. వంటతోపాటు వంటగదిలోనే పనులు చేస్తూ ఉండిపోతుంది. ఇక ఆమె ఏరియా అయిన కిచెన్‌లో ఏదైనా తేడాగా కనిపిస్తే మాత్రం.. హౌస్ మెంబర్స్‌పై అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ చూసిన నెటిజన్లు దామినికి వార్డెన్, వంటలక్క అనే పేర్లు పెట్టేశారు.

తెలుగు బూతులు నచ్చవంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చిన దామిని.. అనవసరంగా ఇంగ్లీష్‌లో బూతులతో రెచ్చిపోతోంది. దీంతో దామినిపై అటు ప్రేక్షకులు, నెటిజన్లే కాదు.. ఇటు హౌస్‌మేట్స్‌ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన గాత్రంతో ఆకట్టుకున్న సింగర్‌ దామిని హౌస్‌లో పెట్టే టాస్క్‌లు, సాటివారితో మాట్లాడే మాటలతో మెప్పించలేకపోతోంది. ఓ టాస్క్‌లో అయితే ప్రిన్స్‌ను వీర లెవల్లో టార్చర్‌ పెట్టింది.

పారితోషికం?

మూడు వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న దామిని ఎంత పారితోషకం తీసుకుందనే వార్తలపై నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. ఈ సింగర్‌ వారానికి రూ.2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతునన్నారు. త్రీ వారాలకుగానూ రూ.6 లక్షలు పారితోషకం తీసుకుందంట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story