Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో దుమ్మురేపిన యావర్.. డేంజర్ జోన్‏లో ఇద్దరు బ్యూటీస్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏ ఆరో వారం నుంచి కాస్తా ఆసక్తిగా మారింది. పోటుగాళ్లు, ఆటగాళ్లు అంటూ 2 టీమ్స్‌గా డివైడ్ చేసిన బిగ్ బాస్.. ఉల్టా, పుల్టాకు ఫుల్ మజా యాడ్ చేశాడు.

Arun Chilukuri
Published on: 12 Oct 2023 12:05 PM IST
Bigg Boss 7 Telugu Season Shobha Shetty And Pooja Murthy In Danger Zone for 6th Week Voting
X

Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో దుమ్మురేపిన యావర్.. డేంజర్ జోన్‏లో ఇద్దరు బ్యూటీస్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏ ఆరో వారం నుంచి కాస్తా ఆసక్తిగా మారింది. పోటుగాళ్లు, ఆటగాళ్లు అంటూ 2 టీమ్స్‌గా డివైడ్ చేసిన బిగ్ బాస్.. ఉల్టా, పుల్టాకు ఫుల్ మజా యాడ్ చేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన 5గురు కంటెస్టెంట్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. దీంతో ఇప్పటికే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాడు. ఇక నామినేషన్స్‌తో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. టాస్కులమీద టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే, ఈవారం ఎలిమినేషన్స్ రంగం మొదలైంది. ఈ వారం కూడా ఓ లేడీ ఇంటి నుంచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమెకు ఓటింగ్ తక్కువగా వచ్చిందని తెలుస్తోంది.

ఆరోవారం ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, అశ్విని శ్రీ, నయని పావని, అమర్ దీప్, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. ఈ 7గురిలో ప్రిన్స్ యావర్ ఓటింగ్‌లో దుమ్మురేపాడు. కార్తిక దీపం ఫేమ్ మోనితా అలియాస్ శోభా శెట్టికి హౌస్ నుంచి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం ఓటింగ్‌లో అట్టడుగున ఉందంట. ఓటింగ్ ప్రకారం ప్రిన్స్ యావర్ 38.17%తో అగ్రస్థానంలో నిలిచాడు. హీరో నుంచి జీరోగా మారిన అమర్ దీప్ కాస్త పర్వాలేదనిపించుకున్నాడు. 18.55% ఓటింగ్‌తో 2వ స్థానంలో ఉన్నాడు. తన కామెడీతో జనాలను నవ్విస్తోన్న టేస్టీ తేజ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆయనకు 14.56% ఓటింగ్ వచ్చింది.

వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి వచ్చిన అశ్విని శ్రీ ముందుగా ఈ వారం ఎలిమేనేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఓటింగ్‌లో సత్తా చాటటడంతో సేఫ్ జోన్‌లో ఉందంట. ఆమెకు 10.78 % ఓటింగ్ రావడంతో 4వ స్థానంలో నిలిచింది. ఇక 7.74 % ఓటింగ్‌తో నయని పావని, 5.7% ఓటింగ్‌తో సీరియల్ హీరోయిన్ పూజా మూర్తి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఇటు ప్రేక్షకులకు, అటు కంటెస్టెంట్లకు పిచ్చి ఎక్కిస్తోన్న మోనితాకు అందరికంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. కేవలం 4.5% శాతం ఓటింగ్ మాత్రమే వచ్చింది. సో ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకోవడం పక్కా అని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story