Bigg Boss Telugu 7: హౌస్‌లో కేకపుట్టిస్తోన్న శివాజీ.. ఓటింగ్‌లో దూకుడు.. ఇక సీరియల్ బ్యాచ్‌ సర్దుకోవాల్సిందేనా?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, ట్విస్టులు, ఎలిమినేషన్‌లు, ఒకరిపై ఒకరు కయ్యాటాలు, గొడవలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కుతోంది.

Jyothi
Published on: 5 Oct 2023 12:40 PM IST
Bigg Boss 7 Telugu Season Actor Sivaji is Leading in Voting Against Serial Batch
X

Bigg Boss Telugu 7: హౌస్‌లో కేకపుట్టిస్తోన్న శివాజీ.. ఓటింగ్‌లో దూకుడు.. ఇక సీరియల్ బ్యాచ్‌ సర్దుకోవాల్సిందేనా?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, ట్విస్టులు, ఎలిమినేషన్‌లు, ఒకరిపై ఒకరు కయ్యాటాలు, గొడవలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కుతోంది. అయితే, ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు భారీగా ఉన్నాయంట. ఈ ఎంట్రీలతో హౌస్‌లో ఇకపై రచ్చ రచ్చగా ఉండనుందంట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలామంది సీరియల నటులే ఉండనున్నారంట.

అయితే, బిగ్ బాస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. స్టార్ మా సీరియల్ బ్యాచ్‌ ఓవైపు, శివాజీ టీమ్‌ మరొకటి. వచ్చే వాళ్లు ఇప్పటికే గేమ్ చూసి వస్తున్నారు. అందుకే వీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని వస్తుంటారు. అయితే, ఈ రెండు టీంలలో ఏదో ఒకదాంట్లో చేరాల్సి వస్తుంది. అయితే, గేమ్ అంతా చూసే వస్తుంటారు కాబట్టి, శివాజీ టీంవైపే మొగ్గు చూపిస్తుంటారని అంతా అనుకుంటున్నారు.

ప్రియాంక, శోభ, అమర్‌లు ఒక బ్యాచ్‌గా కలిపిపోయారు. అయితే, వీళ్లకు సందీప్ జతకట్టాడు. వీళ్లలో తేజ విషయానికి వస్తే.. శోభకు లొంగిపోయాడు. మరో బ్యాచ్‌లో ప్రశాంత్, యావర్‌లకు శివాజీ మార్గనిర్దేశకుడు అయ్యాడు.

ఇక పోల్స్ విషయానికి వస్తే శివాజీకి అత్యధిక ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఇక శివాజీ విషయానికి వస్తే.. నిజాయితీగా ఉండటం, స్ట్రాటజీలతో తోటి వారికి చురకలు అంటిస్తుంటారు. తప్పును ప్రశ్నించడంతోపాటు అవసరం లేని విషయాల్లోకి దూరకపోవడం వంటి అంశాలతో శివాజీ హీరోగా మారాడు.

Jyothi

Jyothi

Next Story