Bigg Boss 7 Telugu: నేడు డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ముగ్గురు.. హింట్ ఇచ్చిన నాగర్జున..!

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో నేడు ఎలిమినేషన్ జరగనుంది. అయితే, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగర్జున హింట్ ఇచ్చేశాడు. దీంతో కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఐదోవారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటూ తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‏లో కెప్టెన్ ప్రశాంత్‌పై ప్రశంసలు కురిపించాడు నాగర్జున.

Jyothi
Published on: 8 Oct 2023 10:23 AM IST
Bigg Boss 7 Telugu Season 5th Week Elimination Priyanka And Subhashree check full details
X

Bigg Boss 7 Telugu: నేడు డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ముగ్గురు.. హింట్ ఇచ్చిన నాగర్జున..!

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో నేడు ఎలిమినేషన్ జరగనుంది. అయితే, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగర్జున హింట్ ఇచ్చేశాడు. దీంతో కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఐదోవారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటూ తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‏లో కెప్టెన్ ప్రశాంత్‌పై ప్రశంసలు కురిపించాడు నాగర్జున. సందీప్, అమర్ దీప్‌లకు క్లాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు సరదాగా సాగింది. ఇక చివరి అంకంగా ఎలిమినేషన్ గురించి టాపిక్ మొదలైంది. హౌస్‌లో ఉండేందుకు అనర్హులు ఎవరో డిసైడ్ చేయాలంటూ వారికే టాస్క్ ఇచ్చాడు. ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురిలో ముగ్గురిని సెలెక్ట్ చేయాలనే కండీషన్ పెట్టాడు. హౌస్ మేట్స్ ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా తేల్చారు. ఇంతలో నాగర్జున ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం అనర్హులు ఎవరనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కాగా, నేడు డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఎలిమినేట్ చేసి, వీరిలో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది.

14 మందితో మొదలైన బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్.. ప్రస్తుతం 10 మంది మాత్రమే మిగిలారు. గత నాలుగు వారాలుగా అమ్మాయిలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వారిలో కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిని, రతిక ఉన్నారు. గత సోమవారం శోభా, సందీప్, ప్రశాంత్ మినహా మిగిలిన ఏడుగురు నామినేట్ అయ్యారు. అయితే శివాజీ ఓటింగ్‌లో దూకుడు చూపించాడు. ఆ తర్వాత స్థానంలో యావర్, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ ఉన్నారు. కాగా చివరి స్థానాల్లో శుభ శ్రీ, ప్రియాంక, టేస్టీ తేజ నిలిచారు. అయితే, అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌తో టేస్టీ తేజ టాప్‌లోకి దూసుకొచ్చాడు. దీంతో ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు.

అయితే, డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుదనడంలో శుభ శ్రీ, ప్రియాంక డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే, వీరిలో ప్రియాంకను సీక్రెట్ రూంలో ఉంచుతారని తెలుస్తోంది. ఇదే నిజమైతే, శుభ శ్రీ హౌస్ నుంచి బయటకు రావొచ్చని తెలుస్తోంది. అసలు విషయం తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అలాగే నేడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో అర్జున్ అంబటి, పూజా మూర్తి, అంజలి పవన్, సింగర్ భోలే షావలితోపాటు నయని పావని కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story