Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్ విజేత విషయంలో రచ్చ.. శివాజీ, శోభాల మధ్య వాగ్వాదం.. పెద్దాయన సారీ చెప్పినా వదల్లేదుగా..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హోస్ లో అరుపులు, ఏడుపులతో రచ్చ, రచ్చ అవుతోంది. అయితే, గత రాత్రి ఎపిసోడ్ లో శివాజీ, శోభా మధ్య జరిగిన రాద్దాంతాం అంతా ఇంతా కాదు.

Shekhar G
Updated on: 18 Nov 2023 12:30 PM IST
Bigg Boss 7 Telugu Latest Episode Day 75 Update Controversy Over The Winner Of The Eviction Pass Between Shivaji And Shobha
X

Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్ విజేత విషయంలో రచ్చ.. శివాజీ, శోభాల మధ్య వాగ్వాదం.. పెద్దాయన సారీ చెప్పినా వదల్లేదుగా..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హోస్ లో అరుపులు, ఏడుపులతో రచ్చ, రచ్చ అవుతోంది. అయితే, గత రాత్రి ఎపిసోడ్ లో శివాజీ, శోభా మధ్య జరిగిన రాద్దాంతాం అంతా ఇంతా కాదు. ఎవిక్షన్ పాస్ కోసం నిర్వహించిన టాస్క్ లో శోభ సంచలక్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో గేమ్ ఆడుతోన్న శివాజీ విషయంలో శోభా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే, మధ్యలో బిగ్‌బాస్ కలగజేసుకుని విన్నర్‌ను డిసైడ్ చేసే ఛాన్స్ శోభాకే ఇచ్చేశాడు. శోభాశెట్టి తనకు అనుకూలంగా ఉన్న వారిని విజేతగా ప్రకటిస్తుందంటూ శివాజీ ఇతర కంటెస్టెంట్ల వద్ద చెబుతుంటాడు. అమర్, ప్రియాంక, సందీప్‌లలో ఒకరిని విజేతగా ప్రకటిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక విజేత విషయంలో శోభా శెట్టి, ప్రశాంత్ మధ్య వాగ్వాదం కూడా జరిగింది.

చివరకు ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. ఈ క్రమంలో విన్నర్‌ ప్రియాంక అని శోభా చెప్పగా.. ప్రశాంత్ మాత్రం యావర్ పేరు చెబుతాడు. దీంతో శోభా మరోసారి ఆలోచనలో పడిపోతుంది. ఫైనల్‌గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి ఎవిక్షన్ పాస్ విన్నర్ ఎవరో చెప్పాలంటూ అడుగుతాడు. యావర్ అంటూ శోభా విజేతను ప్రకటిస్తుంది. యావర్ పేరు చెప్పగానే శివాజీ ఆనందపడుతూ.. చప్పట్లు కొడతాడు. అలాగే మంచి నిర్ణయం ప్రకటించావ్ అంటూ శోభాపై సెటైర్ వేస్తాడు. దీంతో మరోసారి సీరియస్ అయిన శోభా..

దాంతో శోభా మరోసారి రంకెలేసింది. రూల్స్ ప్రకారమే నిర్ణయం తీసుకున్నాం.. తప్పు చేస్తే దేనికైనా రెడీ అంటూ శివాజీపై కేకలేసింది. ఈ క్రమంలో శివాజీ మరోసారి శోభాను రెచ్చగొట్టాడు. నువ్ సంచలక్‌గా ఉన్నప్పుడల్లా గొడవలు కామన్ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో శోభా 'మీరు అన్న ఈ మాటలను తీసుకోలేకపోతున్నాను' అంటూ ఫైర్ అయింది. ఇక గొడవ పెద్దదిగా మారుతుందని గ్రహించిన శివాజీ చివరకు సారీ చెప్పేశాడు. అయినా శాంతించని శోభా కేకలు వేస్తూనే ఉంది.

Shekhar G

Shekhar G

Next Story