Bigg Boss 7 Elimination: కొంపముంచనున్న ఆ కామెంట్స్‌.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఆమె..?

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 అలా మొదలైందో.. లేదో.. ఓవైపు టాస్క్‌లతో రచ్చ.. మరోవైపు ఎలిమినేషన్‌లతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చులతో మూడోవారం కూడా ముగిసేందుకు చేరుకుంది.

Arun Chilukuri
Updated on: 23 Sept 2023 6:00 PM IST
Bigg Boss 7 Telugu Damini May Elimination in 3rd Week
X

Bigg Boss 7 Elimination: కొంపముంచనున్న ఆ కామెంట్స్‌.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఆమె..?

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 అలా మొదలైందో.. లేదో.. ఓవైపు టాస్క్‌లతో రచ్చ.. మరోవైపు ఎలిమినేషన్‌లతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చులతో మూడోవారం కూడా ముగిసేందుకు చేరుకుంది. వీకెండ్‌లో షో అంటే ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడమే అన్నమాట. రెండో వారం షకీలా ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక మూడో వారం జాబితాలో ఏడుగురు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అప్పుడే తెలియకపోయినా.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఓ లేడీ కంటెస్టెంట్ ఇంటిదారి పట్టినున్నట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం కూడా ఉంది. హౌస్‌లోని కొందరిపై హాట్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌తోనే చిక్కులో పడ్డట్లు అంటున్నారు.

బిగ్‌బాస్ 7 తెలుగులో అబ్బాయిలు, అమ్మాయిలు ఏడుగురు చొప్పున 14 మంది ఎంట్రీ ఇచ్చారు. కాగా, తొలి రెండు వారాల్లో ఇద్దరు లేడీస్ కిరణ్ రాథోడ్, షకీలా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇక 3 వారం జెంట్స్ ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. కానీ, ఈ కామెంట్స్‌తో 3వ వారం కూడా లేడీ కంటెస్టెంట్ కథ ముగిపిపోనున్నట్లు అంటున్నారు. ఇక 3వ వారం నామినేషన్స్‪‌లో శుభశ్రీ, దామిని, ప్రియాంక, రతిక అమ్మాయిలే ఉన్నారు. వీరిలోనుంచి ఒకరు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

వీరిలో దామిని ఈ వారం బిగ్ బాస్‌కు బైబై చెప్పనుందనే టాక్ నడుస్తోంది. మిగతా ముగ్గురు ఆడియెన్స్‌ను ఏదో విధంగా ఆకట్టుకుంటున్నారు. ఓట్లు కూడా వీళ్లకు బాగానే పడుతున్నాయంట. అయితే, దామినీ మాత్రం గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్స్ యవర్‌పై మతపరమైన కామెంట్స్‌తో చేసిందంట. ఇదే ఈమె పాలిట విలన్‌లా మారయని అంటున్నారు. ఇదే జరిగితే హౌస్ నుంచి ముగ్గురు లేడీస్ ఔట్ అయినట్లే. ఏం జరుగుతుందనేది ఈ వారం చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story