Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో రైతు బిడ్డదే హవా.. ఆ బ్యాచ్‌కు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. ఈవారం ఎలిమినేషన్‌లో ఆ ఇద్దరు?

Bigg Boss 7 Telugu Updates: ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఓటింగ్‌లో అదరగొడుతున్నాడు.

Arun Chilukuri
Updated on: 14 Sept 2023 6:02 PM IST
Bigg Boss 7 Telugu 2nd Week Nomiantions and Votings Raithu Bidda Pallavi Prashanth 1st Place
X

Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో రైతు బిడ్డదే హవా.. ఆ బ్యాచ్‌కు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. ఈవారం ఎలిమినేషన్‌లో ఆ ఇద్దరు?

Bigg Boss 7 Telugu Updates: ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఓటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆయన కంటే హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలను కూడా వెనక్కునెట్టేలా చేశాడు. దీంతో సీరియల్ బ్యాచ్ కంటే రైతు బిడ్డ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍కు తొలిరోజు అత్యధిక ఓట్లు పడ్డాయి. దాదాపు 42 శాతం ఓటింగ్‌తో నం.1 స్థానంలో ప్రశాంత్ నిలిచాడు. నామినేషన్స్‌లో జరిగిన రచ్చ తర్వాత రైతుబిడ్డ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుబిడ్డ ప్రశాంత్‌ను ఆడుకుంటున్న అమర్ దీప్‌కు మాత్రం 16 శాతం ఓట్లే వచ్చాయంటే.. దానికి బలమైన కారణం కూడా ఉంది. నామినేషన్స్ లో బీటెక్ స్టూడెంట్స్, రైతులు అంటూ అమర్ దీప్ రచ్చ చేశాడు. ప్రశాంత్‌ని అరేయ్, రేయ్ అంటూ పిలవడంతోపాటు అరవడం, పళ్లు బిగించి చూడడం లాంటివి కూడా అమర్ దీప్ కు మైనస్ పాయింట్‌గా మారాయి. బిగ్ బాస్ హౌస్‌లో సినీ నటుడు శివాజీకి 21 శాతం ఓట్లు వచ్చాయి.

కార్తీకదీపం విలన్ మోనిత అలియాస్ శోభాశెట్టికి కేవలం 2 శాతం ఓట్లే రావడం గమనార్హం. రతికకు 4 శాతం ఓట్లు రాగా.. గౌతమ్ కృష్ణకు 3 శాతం, ప్రిన్స్ యావర్ కు 8 శాతం, షకీలాకు 2 శాతం, టేస్టీ తేజాకు 2 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఓటింగ్‌లో టేస్టీ తేజా, షకీలా, శోభాశెట్టి చివరి స్థానంలో నిలిచారు. కాగా, ఈ వారం డేంజర్ జోన్ లో టేస్టీ తేజ, షకీలా ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story