Bigg Boss 5 Telugu Promo: చరణ్ తో సరదాగా మొదలై.. నాగ్ తో సీరియస్ గా ముగియనుందా..!!

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రోమో తాజాగా విడులైంది.

Sandeep Reddy
Updated on: 18 Sept 2021 8:05 PM IST
Bigg Boss 5 Telugu Weekend Promo Released Today 18 09 2021
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రోమో(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రోమో తాజాగా విడులైంది. శనివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాగార్జునతో పాటు కనిపించనున్నాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో రామ్ చరణ్ సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకోనుంది. నామినేట్ అయిన సభ్యులలో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో ఆదివారం ఎపిసోడ్ లో రివిల్ చేయనుండగా.. ఈరోజు సేఫ్ కాబోయే ఇద్దరు ఇంటి సభ్యులు ఎవరో మరికాసేపట్లో తెలియనుంది. శ్వేతవర్మ మీతో నటించాలని ఉందని చరణ్ ని అడగగానే వెంటనే ఓకే చెప్పిన చెర్రీ.. ఈరోజు లోబో లాగా డ్రెస్ అయి వచ్చానని అనగానే లోబో ఆనందంలో మునిగిపోయాడు.

ఉమాదేవి బూతులు మాట్లాడుతుంది ఇంట్రడ్యూస్ చేసిన నాగ్.. శన్ముక్ తో దీప్తి.., శ్రీ రామ్ తో హమిదా ప్రేమకథలకు తనదైన శైలిలో పంచ్ డైలాగ్ తో హౌస్ మేట్స్ ని నవ్వించాడు. మొదటి ప్రోమోలో సరదాగా మాట్లాడిన నాగ్ రెండో ప్రోమోలో హౌస్ మేట్స్ కి క్లాస్ పీకాడు. శ్వేతా వర్మ నామినేషన్ లో హమిదాపై ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్.. విజే సన్నీ టాస్క్ లో భాగంగా సిరి హనుమంత్ తో జరిగిన సంఘటనపై నాగార్జున సీరియస్ అయ్యారు. ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి అటు సరదాగా మొదలై సీరియస్ గా ఎండ్ అవనుందని తెలుస్తుంది.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story