BB5 Promo: నామినేషన్ల మ్యాజిక్ అర్ధంకాక ఐన్ స్టీన్ లాజిక్ చెబుతున్న శన్ముఖ్

* మంగళవారం బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 12 Oct 2021 4:34 PM IST
Bigg Boss 5 Telugu Tuesday Latest Promo Released 12th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

BB5 Telugu Promo: సోమవారం అగ్నిపరీక్షతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసినా ఇంటి సభ్యుల్లో ఒకరైన శ్వేతవర్మ మాట్లాడిన మాటలు వింటుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఆ సెగ మాత్రం తగ్గినట్టుగా కనిపించట్లేదు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో శన్ముఖ్ జస్వంత్ తనపై చేసిన కామెంట్స్ పై శ్వేతవర్మ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చూశాము. మరోపక్క నామినేషన్లతో సంబంధం లేకుండా విజే సన్నీ మాత్రం తన కామెడీతో ఇంటి సభ్యులను నవ్వించడం చూడొచ్చు.

శ్రీరామచంద్ర, హమీదాలను అనుకరిస్తూ వారిలా మాట్లాడటం, నటించడం మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు నవ్వులు పూయించింది. ఇక మోజ్ రూమ్ లోనే కూర్చొని సమయాన్ని గడిపే శన్ముఖ్ రోజులాగే అదే రూమ్ లోనే కూర్చొని జెస్సీతో ఈవారం నామినేషన్ గురించి మాట్లాడుతాడు. ఐన్ స్టీన్ లాజిక్ నైనా ప్రయత్నిస్తే అర్ధం చేసుకోవచ్చేమో కాని ఈ నామినేషన్ టాస్క్ లో ఎవరు ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో మాత్రం అర్ధంకావడం లేదంటూ జెస్సీతో శన్ముఖ్ జస్వంత్ ఇంటిసభ్యుల గురించి మాట్లాడుకుంటారు.

ఇక ఆర్జే కాజల్.. శ్రీరామచంద్రతో వరస్ట్ పెర్ఫర్మార్ టాస్క్ తో పాటు నామినేషన్ లో జరిగిన గొడవతో అతనికి బ్రేకప్ చెప్తున్నానని.., బహుశా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య బ్రేకప్ చెప్పుకోవడం ఇదే మొదటిసారి కావొచ్చు అంటూ శ్రీరామచంద్రతో కామెంట్ చేస్తుంది. ఇంటి సభ్యులు ఎంత కలిసుందామని ప్రయత్నించిన బిగ్ బాస్ మాత్రం ఏదో ఒక టాస్క్ తో మ్యాజిక్ చేసి ఇంటిసభ్యుల మధ్య మంటలు పెడుతూ ఏ వారం కూడా సాఫీగా సాగకుండా ప్రయత్నాలు చేస్తాడని ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా అర్ధమైంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story