BB5 Buzz Promo - Siri Hanumanth: చోటు కావాలా..? శన్ను స్నేహం కావాలా..?

Sandeep Reddy
Published on: 20 Dec 2021 6:06 PM IST
Bigg Boss 5 Telugu Top 5 Contestant Siri Hanumanth Bigg Boss 5 Buzz Interview Promo
X

BB5 Buzz - Siri Hanumanth: చోటు కావాలా..? శన్ను స్నేహం కావాలా..?(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Buzz Promo - Siri Hanumanth: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఇంటి సభ్యులను బిగ్ బాస్ 5 బజ్ షోలో ఇంటర్వ్యూ చేసే అరియానా తాజాగా సిరి హనుమంత్ ని ఇంటర్వ్యూ చేసిన ప్రోమో విడుదలైంది. ఇంటర్వ్యూలో భాగంగా సిరి హనుమంత్ ని అరియానా తనదైన స్టైల్ లో ప్రశ్నలతో షాక్ ఇచ్చింది. శన్ముఖ్ జస్వంత్ ఫొటోని స్క్రీన్ పై చూపించి అతడి గురించి చెప్పమని అడగడంతో "అందరికి తెలుసు కదా.. ఏమి చెప్పాలి' అనడంతో అరియానా.. సిరి హనుమంత్ ని హగ్ చేసుకుంటూ "ఫ్రెండ్లీ హగ్ రా.. ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హగ్" అని శన్ను డైలాగ్ తో సిరికి పంచ్ ఇచ్చింది. దాంతో "గట్టిగా వెళ్లినట్లు ఉన్నాయ్ గా హగ్గులు" అని సిరి నవ్వింది.

ఇక సన్నీతో కావాలనే టార్గెట్ చేసి గొడవ పెట్టుకున్నావా అని అడిగిన ప్రశ్నకి నిజంగా అలాంటిదేమీ లేదని.. ప్రతి టాస్క్ లో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని.. అలా అయితే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా వస్తుందని సిరి హనుమంత్ చెప్పింది. మరి శన్నుతో కూడా రోజు గొడవ జరుగుతుంది కదా అని అరియానా అడగడంతో టాస్క్ లో అవలేదు కదా సిరి చెప్తుంది. టాస్క్ లో అవడం వేరు.. మాములుగా వేరు ఎలా ఉంటుందని అనడంతో ఏమి చెప్పాలో అర్ధంకాక సిరి సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత మోజ్ రూమ్ లో శన్నుని ముద్దు పెట్టుకోవడం గురించి కూడా ప్రశ్నించింది. ఇక చివరగా "చోటు..? లేక శన్ముఖ్ జస్వంత్ తో స్నేహం..??".. ఈ రెండింటిలో ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఏది ఎంచుకుంటావంటూ సిరిని అరియానా ప్రశ్నలతో ఒక ఆట ఆడుకుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story