VJ Sunny: బిగ్ బాస్ టైటిల్ విజేత విజే సన్నీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!?

Sandeep Reddy
Updated on: 20 Dec 2021 3:22 PM IST
Bigg Boss 5 Telugu Title Winner VJ Sunny Remuneration Details
X

VJ Sunny: బిగ్ బాస్ టైటిల్ విజేత విజే సన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?

VJ Sunny Remuneration: బుల్లితెరలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో 19 మంది కంటెస్టంట్స్ లో ఒక్కడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ఆటతీరుతో పాటు ఎంటర్‌టైనర్‌గా నిలుస్తూ కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలిచి బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్నాడు విజే సన్నీ.. తన తల్లి కళావతి ఎప్పుడూ ఏమి అడగలేదని మొదటిసారి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని రమ్మని కోరిందని.. తన కోరిక నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ టైటిల్ గెలిచిన అనంతరం బిగ్ బాస్ స్టేజిపై సన్నీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక టైటిల్ తో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు సువర్ణభూమిలో 25 లక్షల విలువైన ప్లాట్ ని దక్కించుకున్నాడు.

15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సన్నీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే.. వారానికి 2 లక్షల చొప్పున 15 వారాలకు 30 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక అపాచి స్పోర్ట్స్ బైక్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే సన్నీ 50 లక్షల ప్రైజ్ మనీ నుండి ఆదాయపు పన్ను మినహాయిస్తే 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా సన్నీ బిగ్ బాస్ షో ద్వారా 92 లక్షల రూపాయల వరకు సంపాదించినట్టు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన సన్నీ.. జర్నలిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తరువాత ఒక ప్రముఖ ఛానెల్ లో వీడియో జాకీగా మారాడు. ఇక సీరియల్స్‌లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని గెల్చుకొని టైటిల్ విజేతగా నిలిచి అతి త్వరలో "సకల గుణాభిరామ" చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story