BB5 Telugu Highlights: ఆది(వారం) పంచులతో బిగ్ బాస్ (ద)సరాదా సంబురాలు

Sandeep Reddy
Published on: 11 Oct 2021 11:05 AM IST
Big Boss 5 Telugu Dussehra Sunday Episode Highlights 10th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

BB5 Telugu Highlights: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ దసరా సంబురాలతో పాటు సినిమా ప్రమోషన్లతో ఆద్యంతం సరదాగా సాగింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులలో ఎవరు సేవ్ అయ్యారో ప్రకటించని నాగార్జున.. ఆదివారం సాయంత్రం నుండి మొదలైన దసరా స్పెషల్ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు రకరకాల ఆటలు ఆడిస్తూ అటు ఇంటి సభ్యులను కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

రవి - ఆర్జే కాజల్ ని ఎంపిక చేసి రెండు టీమ్స్ గా ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ లతో నవ్వులు పూయించాడు బిగ్ బాస్. అలా పాల్గొన్న టాస్క్ లలో ఆర్జే కాజల్ జట్టు విజయం సాధించింది. ఇక గెలిచినా జట్లలో ఒకరికి వారి ఇంటి సభ్యుల వీడియో చూపించడంతో ఇంటి సభ్యులు ఆనందంతో పాటు ఉద్వేగానికి లోనయ్యారు. మొదటగా లోబో తన కూతురితో.., ప్రియ, ఆనీ మాస్టర్, రవి, హమీదా, విశ్వా, మానస్, ఆర్జే కాజల్, సిరి హనుమంత్ లు తమ ఇంటి సభ్యుల వీడియో చూసి సంతోషపడ్డారు.

బిగ్ బాస్ సెట్ పై హెబ్బ పటేల్, సంధ్యల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత హైపర్ ఆది ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులపై తన మాటలతో తూటాలతో ప్రేక్షకుల మనసులో మెదిలిన ప్రశ్నలన్ని ఇంటి సభ్యులను అడిగి తనదైన స్టైల్ లో ఒక్కొక్కరిని కడిగిపడేశాడు. అక్కినేని అఖిల్, పూజ హేగ్దే జంటగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజిపై సందడి చేశారు.

ఇక నామినేషన్ విషయానికొస్తే ఎనిమిది మంది ఇంటి సభ్యుల నుండి మొదటగా మానస్ సేవ్ అవగా, ఆ తరువాత జెస్సి, ప్రియ, ఆనీ మాస్టర్, సన్నీ, శన్ముఖ్ జస్వంత్ వరుసగా ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. చివరగా విశ్వా - హమీదా ఇద్దరిలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి హమీదా ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించడంతో ఇంటి సభ్యులు షాక్ అయి ఆమెని బాధతో ఇంటి నుండి బైటికి సాగనంపుతారు. ఇలా ఆదివారం ఎపిసోడ్ సరదాగా మొదలై హమీదా ఎలిమినేషన్ తో ముగిసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story