Bigg Boss: బిగ్‌బాస్‌ ఐదో సీజ‌న్ ఎప్పుడంటే

Bigg Boss: బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షో యామ‌ క్రేజ్ ఉంది.

Samba Siva Rao
Published on: 7 May 2021 10:21 PM IST
BigBoss 5th sesion
X

బిగ్ బాస్  ఐదో సీజ‌న్ 

Bigg Boss: బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షో యామ‌ క్రేజ్ ఉంది. ఈ షో ఎన్నిభాష‌ల్లో వ‌చ్చినా సరే అభిమానులకు పండగే. ఇక తెలుగులో ఈ షో ఉన్న ఆద‌ర‌ణ ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గతేడాది ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిన విషయమే. హోస్ట్ గా వ‌చ్చిన నాగార్జున తన అనుభవంతో షోను ర‌క్తిక‌ట్టించారు. బిగ్‌బాస్‌ నిర్వాహకులు 5వ‌ సీజన్‌పై దృష్టి పెట్టారు.

అయితే దీనికి సంబంధించి యూట్యూబ్ చానెల్‌లో 'మీరు బిగ్‌బాస్ షో'ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం అగష్టులో బిగ్‌బాస్‌ 5ని ప్రారంభించాలని నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారట. గత రెండు సీజన్లు కింగ్‌ నాగార్జున వల్లే హిట్టైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

గ‌త ఏడాది మాదిరిగానే కంటెస్టెంట్స్ కొన్ని రోజులు క్వారంటైన్ ఉంచ‌నున్నారు. ఇప్ప‌టికే కంటెస్టెంట్స్ ఎంపీక దాదాపు పూరైందనట్లు కూడా తెలుస్తోంది. ఇక సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. ఆగష్టు నాటికి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని బిగ్ బాస్ నిర్వాహకులు భావించి షోను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వినికిడి. బిగ్ బాస్ మ‌ళ్లీ వ‌స్తే అభిమానులు టీవీల‌కు అతుక్కుపోవాల్సిందే.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story