BB5 Telugu: సన్నీ విషయంలో తెలియక నోరు జారారు.. తెలిసాక మాట మార్చారు

BB5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 శనివారం జరిగిన ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 19 Sept 2021 12:09 PM IST
Bigg Boss 5 Telugu September 18 Highlights | Bigg Boss 5 Telugu Latest Promo Today
X

సన్నీ విషయంలో తెలియక నోరు జారారు.. తెలిసాక మాట మార్చారు

BB5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 శనివారం జరిగిన ఎపిసోడ్ లో జోకులతో పాటు నాగార్జున హౌస్ మేట్స్ కి పీకిన క్లాసు తో కూల్ గా స్టార్ట్ అయి హాట్ గా ముగిసిందనే చెప్పాలి.. రామ్ చరణ్ తో సరదా సంభాషణ తరువాత హౌస్ మేట్స్ ఎవరైతే ఈ వారంలో తప్పుగా ప్రవర్తించరో తాను చెప్పక ముందే నిల్చుంటే బాగుంటుందని నాగ్ చెప్పడంతో నిలుచున్నా ఇంటి సభ్యులకు ఒక్కోరికి ఒక్కో విధంగా సమాధానం ఇచ్చారు.. ఇందులో ముఖ్యంగా ఉమాదేవి మాట్లాడే బూతులను తగ్గించుకోమని సలహా ఇస్తూనే 3 గుంజిలు తీసి ప్రేక్షకులకు క్షమాపణ చెప్పమని తెలిపడంతో ఉమా నాగ్ చెప్పినట్టు చేసి క్షమాపణలు చెప్పింది..

ఇక టాస్క్ లో భాగంగా ఆడిన గేమ్ లో సిరి హనుమంత్ వద్ద ఉన్న ప్లాంకెట్ ని సన్నీ తన టీ షర్ట్ లో చెయ్యి పెట్టి తీసాడని గోల చేసిన సిరి కి, అలా చేసినపుడు నేను కూడా చూసానని చెప్పిన షణ్ముఖ్ కి నాగార్జున ఆ వీడియోని మరోసారి ప్లే చేసి చూపించడంతో షాక్ అయిన సిరి, షణ్ముఖ్ ఒక్కసారిగా మాట మార్చి సారీ చెప్పి సరిపెట్టేసారు.. సిరి నా ఫ్రెండ్ నేను అలా చేయలేదు.. చేయను మొర్రో అని సన్నీ ఎంత మొత్తుకున్న తన క్యారెక్టర్ ని దెబ్బతీసేలా మాట్లాడిన వారందరికీ నాగార్జున వీడియోతో చిన్న పాటి క్లాస్ కూడా పీకాడు.. ఇలా చూడని, తెలియని విషయాల్లో జోక్యం చేసుకొని వ్యక్తుల క్యారెక్టర్ ని దెబ్బ తీసేలా మాట్లాడొద్దు అని హౌస్ మేట్స్ కి సూచించాడు.. దీంతో సన్నీ తాను మొదట ఎవరికి చెప్పిన నమ్మలేదని.. ఈరోజు మీ వల్ల ఆ విషయంలో క్లారిటీ వచ్చినందుకు సంతోషంగా ఉందని నాగార్జునకు థాంక్స్ చెప్పేసాడు..

మరోపక్క శ్వేతా వర్మ.. హామీద తో మరియు లోబోతో ప్రవర్తించిన తీరుకు సారీ చెబుతూ తనకు తానుగా చెంప దెబ్బలు కొట్టుకుంది.. శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఆని మాస్టర్, లోబో, ప్రియాంక ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యారు.. అర్జె కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ లు డేంజర్ జోన్ లో ఉన్నారు.. ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు సేఫ్ అవుతారో.. ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్తారో తేలనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story