Bigg Boss 5 Telugu: మూడు గొడవలు.., ఆరు తిట్లతో సాగిన రెండో రోజు బిగ్ బాస్

* తెలుగు బిగ్ బాస్ 5 రెండో రోజు మూడు గొడవలు.., ఆరు తిట్లతో సాగింది.

Sandeep Reddy
Published on: 8 Sept 2021 1:47 PM IST
Bigg Boss 5 Telugu Second Day Starts With Conflicts Ends With Cry
X

బిగ్ బాస్ తెలుగు 5 రెండవ రోజు (ఫోటో: స్టార్ మా) 

Bigg Boss 5 Telugu : తెలుగు బిగ్ బాస్ 5 రెండో రోజు మూడు గొడవలు.., ఆరు తిట్లతో సాగింది. ఆర్జే కాజల్, లహరి మధ్య సంభాషణలో కంటెంట్ ప్లే చేయొద్దు ప్రతిదానికి అంటూ లహరి మాట్లాడటం ఆ విషయంపై ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకోవడం.. ఆ తరువాత లహరికి ఆర్జే కాజల్ క్షమాపణలు చెప్పడం కన్నీరు పెట్టుకోవడం జరిగిపోయింది. అదే సమయంలో పవర్ రూమ్ టాస్క్ లో గెలిచి పవర్ రూమ్ లోకి వెళ్ళిన మానస్ కి బిగ్ బాస్ అందరు పడుకున్న తరువాత పడుకోవాలి అంటూ ఇచ్చిన టాస్క్ కి ఎవరిని ఎంపిక చేసుకుంటావని బిగ్ బాస్ అడగంతో ఆర్జే కాజల్ పేరును చెబుతాడు మానస్.

ఇక లోబో, సిరి మధ్య జరిగిన మాటల యుద్ధం మాములుగా మొదలై సీరియస్ గా మారి సిల్లీగా ముగిసింది. మరోపక్క జెస్సీ తన చిన్నపిల్లాడి చేష్టలతో మొదటి రోజులాగే రెండో రోజు కూడా తన ప్రవర్తనతో హౌస్ మేట్స్ ని కాస్త ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. ఒక కుర్చీ కోసం ఆనీ మాస్టర్ తో గొడవపడి జెస్సి మాట్లాడిన తీరు ప్రేక్షకులకే కాకుండా హౌస్ మేట్స్ కి కూడా నచ్చలేదు. ఈ గొడవలో లోబో, యాంకర్ రవి హౌస్ మేట్స్ కి నచ్చజెప్పడం, విశ్వ తన తమ్ముడిని గుర్తుచేసుకొని బాధపడటం మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో ముఖ్యంగా జరిగినవి. ఇక మొదటి రోజు లాగానే రెండో రోజు కూడా శన్ముఖ్ జశ్వంత్ సైలెంట్ గా ఉండిపోయాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story