Bigg Boss Telugu 5: ఇద్దరి రాజుల మధ్య ముగ్గురు దొంగలు

*బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 6 Oct 2021 12:20 PM IST
Bigg Boss Telugu 5 Season 05 October 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

 బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu Updates: బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ అనుకున్నట్లుగానే శన్ముఖ్ జస్వంత్ - శ్రీరామచంద్ర మధ్య జెస్సీకి సంబంధించిన విషయంపై మరోసారి మాటల యుద్ధం నడుస్తుంది. విన్నవే మాట్లాడాలని తన రూల్ బుక్ లో ఏమిలేదన్న శన్ముఖ్ కి శ్రీరామచంద్ర తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. 26 ఏళ్ళకే అన్ని తెలుసనుకోవడం తప్పని, తెలియని విషయాలు తెలుసుకొని నీ రూల్ బుక్ లో పెట్టుకోమంటాడు శ్రీరామచంద్ర. వయసు గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని.., ఇక్కడ వయసును చూసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపలేదని శన్నుకు సపోర్ట్ చేస్తూ సిరి.. శ్రీరామచంద్ర పైకి ఫైర్ అవుతుంది.

ఆ తరువాత ఫుడ్ మీరు తిన్న తరువాతే తను కూడా తింటానని కెప్టెన్ గా అందరు ఇంటి సభ్యులు తినడం నా బాధ్యత అని శ్రీరామ్.. శన్ను, జెస్సీ, సిరిలకు చెబుతాడు. ఆ తరువాత సంభాషణలో శన్ను, జెస్సి, సిరి ఈ గొడవని ఈరోజుతోనే ముగించాలని అనవసరంగా రేపటికి పొడగించాల్సిన అవసరంలేదని నిర్ణయించుకుంటారు. మరోపక్క ఆర్జే కాజల్.. యాంకర్ రవి, లోబోలపై వాష్ రూమ్ వర్క్ నుండి కిచెన్ వర్క్ కి వచ్చారంటూ ఎగతాళి చేస్తూ చేసిన కామెంట్స్ కి లోబో చేసిన పనికి కాజల్ సీరియస్ అవగా.., కాజల్ మాట్లాడిన మాటలకు రవి ఆమెపై ఆగ్రహంతో మాట్లాడటంతో ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటారు.

తరువాత అమెజాన్ గేమ్ కోసం నలుగురు ఇంటి సభ్యులను ఎంపిక చేసి వారికి నచ్చిన వ్యక్తులకు ఆ బహుమతులను ఇవ్వొచ్చని, ఆ నలుగురు వ్యక్తులు ఎవరో తెలిపాలని బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ శ్రీరామచంద్రని ఆదేశించగా.. ఇంటి సభ్యుల నుండి ప్రియ, శన్ముఖ్, మానస్, హమీదాలను ఎంచుకుంటాడు. వారికి వచ్చిన బహుమతులను ప్రియ, మానస్, హమీదాలు వారి యొక్క తల్లి కోసం, శన్ను తన డైరెక్టర్ కోసం వారికి వచ్చిన బహుమతులను ఇస్తున్నట్లు తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి, సన్నీలను రాజకుమారులుగా నియమించి సన్నీ ప్రజా.. రవి ప్రజా అంటూ రెండు జట్లుగా ఎంపిక చేసి ఇంటి సభ్యులు ఎవరికీ ఏ రాజకుమారుడు నచ్చితే వారికి సపోర్ట్ చేయవచ్చని తెలపడంతో ఇంటి సభ్యులు డబుల్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు.

అందులో టాస్క్ ముందే జెస్సి రాజకుమారుల వద్ద ఉన్న నాణేలను దొంగతనం చేయడం అందుకు శన్ముఖ్ సపోర్ట్ చేయడం.. ఆ తరువాత సిరి అటు సన్నీతో పాటు రవి దగ్గరి నుండి కూడా నాణేలను దొంగిలించి ఏమి తెలియనట్టుగా నటించడం మంగళవారం ఎపిసోడ్ లో జరిగింది. ఇక రవికి శ్రీరామచంద్ర, హమీదా, ఆని మాస్టర్, శ్వేతవర్మ సపోర్ట్ చేయడం రవికి జేజేలు కొట్టే సమయంలో శ్రీరామచంద్ర జై జై శ్రీగణేశా అంటూ ఎందుకు పాట పాడాడో.. ఏ సందర్భంలో పాట పాడాలో కూడా అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడా అంటూ ప్రేక్షకులు బిత్తరపోయారు. ఇంటి సభ్యులు అంత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కోసం బిజీగా ఉంటె శన్ముఖ్, సిరి, జెస్సి మాత్రం ఇంట్లో ఉన్న నాణేలను దొంగతనం చేయడంలో బిజీబిజీగా గడిపారు.

చివరికి విశ్వా ఈ విశ్వా ఈ విషయాన్నీ గ్రహించి నాణేల పెట్టెను తీసుకు రావడం.. అటు రవితో పాటు సన్నీ పెట్టెలో కూడా నాణేలు దొంగిలించబడటం గుర్తిస్తారు. ఆ తరువాత జెస్సి తన నాణేలను ఇచ్చిన సిరి మాత్రం ఏమి తెలియనట్టుగా నటించడం చూశాము. నాణేలు దొంగతనం అయిన విషయం తెలిసిన విశ్వా సన్నీ టీం సభ్యులపై సీరియస్ అవడం బుధవారం ఎపిసోడ్ లో చూడనున్నాము. నేటి ఎపిసోడ్ లో యాంకర్ రవి తరపున విశ్వా.. సన్నీ తరపున మానస్ లు కుస్తీ పోటీలో పాల్గొననున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story